Home Lifestyle Do you know Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Variety Railway Station | రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ తప్పనిసరి. కొంతమంది టికెట్‌ లేకుండా కూడా రైలులో ప్రయాణిస్తుంటారు. టీసీకి దొరికిపోయినప్పుడు జరిమానా కట్టి తప్పించుకుంటారు. ఇదెక్కడైనా జరిగేదే కానీ యూపీలోని ఒక ఊరి ప్రజలు మాత్రం రైలు టికెట్‌ కొంటారు కానీ రైలు ఎక్కరు.. అందులో ప్రయాణించరు. వినడానికి విడ్డూరంగా అనిపించినా దానికో ప్రత్యేక కారణం కూడా ఉంది. అదేంటో మీరే తెలుసుకోండి.

ఉత్తర ప్రదేశ్‌లోని దయాల్‌ పూర్‌లో 1954లో రైల్వే స్టేషన్‌ నిర్మించారు. కొత్తలో రైలు ప్రయాణం చేసేవాళ్లు చాలా మందే ఉండేవాళ్లు. కానీ క్రమంగా అక్కడి నుంచి ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోయింది. దాంతో రైల్వే ఆదాయం కూడా తగ్గిపోయింది. చేసేదేం లేక అధికారులు రైల్వే స్టేషన్‌ మూసేశారు. దీంతో గ్రామస్థులందరూ ఏకమై ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించి మళ్లీ రైల్వే స్టేషన్ తెరిచేటట్లు చేశారు.

ఈ రైల్వే స్టేషన్‌ను 2006 లో మూసేయగా.. ప్రజల విజ్ఞప్తిని మన్నించి 2022లో తిరిగి ప్రారంభించారు. మళ్లీ మొదలైన స్టేషన్‌లో కొన్నాళ్ల పాటు టికెట్లు మామూలుగానే అమ్ముడుపోయాయి. కానీ మళ్లీ కొద్ది కాలం తరువాత టికెట్లు అమ్ముడవక మళ్లీ ఆదాయం తగ్గుతూ వచ్చింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న స్టేషన్ మళ్లీ మూతపడటం ఇష్టం లేని గ్రామస్తులు వారు ప్రయాణం చేయకపోయినప్పటికీ టికెట్లు కొంటూనే ఉన్నారు.

అలా 2022 డిసెంబర్‌ చివరి నాటికి 700 టికెట్లు అమ్ముడుపోయాయి. కానీ ఈ ఏడాది మొదటి నుంచి మళ్లీ టికెట్ల అమ్మకాలు తగ్గాయి. దీనిని తెలుసుకున్న ఊరి ప్రజలు మళ్లీ పెద్ద ఎత్తున టికెట్లు కొనడం మొదలు పెట్టారు. ఆదాయం తగ్గినప్పుడల్లా మేము టికెట్లు కొంటామని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Exit mobile version