Home Lifestyle Do you know CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్...

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

CPR | ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కాలేజీ విద్యార్థుల నుంచి గుండెపోటుకు గురవుతున్నారు. క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో గుండెపోటుతో కిందపడిపోయిన వాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మరి సీపీఆర్ అంటే ఏంటి.. ఎలా చేయాలి.. సీపీఆర్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చూడండి.

ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయొచ్చు

సీపీఆర్ అంటే.. కార్డియోపల్మనరీ రీససిటేషన్‌. గుండె పనితీరు ఆగిపోయేటప్పుడు లేదా ఆగిపోయిన వారికి వెంటనే రక్తం పంప్ చేసేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుంది. గుండెపోటు వచ్చిన వాళ్లందరికీ సీపీఆర్ తప్పకుండా అవసరమని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా రెండు సందర్బాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. హార్ట్ బీట్ లేకపోవడం వల్ల రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు ఈసీజీలో స్ట్రెయిట్ లైన్ వస్తుంది. ఇలాంటి సందర్భంలో సీపీఆర్ చేస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. సాధారణంగా 72 నుంచి 80 సార్లు కొట్టుకునే గుండె.. 200 సార్లు కొట్టుకుంటుంది. ఆ తర్వాత అలసిపోయి అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లోనూ సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలబెట్టొచ్చని వైద్యులు చెబుతున్నారు.

సీపీఆర్ ఎలా చేయాలి ?

  • ఎవరైనా గుండెపోటుతో కిందపడిపోయినట్లు కనిపించగానే వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి సీపీఆర్ స్టార్ట్ చేయాలి. ముందుగా బల్లపరుపుగా ఉన్న ప్లేస్‌లో తల పైకి ఉండేలా పడుకోబెట్టాలి. కింద పడిపోయిన వ్యక్తి చలనం లేకుండా ఉంటే గుండె దగ్గర చేయి పెట్టి పల్స్ చెక్ చేయాలి. అక్కడ పల్స్ లేకుంటే మెడ వద్ద పల్స్ చూడాలి. పల్స్ దొరకలేదంటే గుండె ఆగిపోయినట్లు అర్థం చేసుకోవాలి.
cpr
CPR ( Image Source: Pixabay )
  • ఇలా ఆగిపోయినప్పుడు వెంటనే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. ఎడమ చేయి వేళ్ల మధ్య కుడి చేయి వేళ్లు జొప్పించి లేదా కుడిచేయి వేళ్లల్లో ఎడమ చేయి జొప్పించి పేషెంట్ ఛాతి మధ్య భాగంలో (గుండె పై కాదు ) నొక్కాలి. అలా వేగంగా నిమిషానికి 100 నుంచి 120 సార్లు ప్రెస్ చేస్తూ ఉండాలి. నొక్కేటప్పుడు మన చేతులు మోచేతులు వంగకుండా చూసుకోవాలి. చేతులు స్టిఫ్‌గా ఉంచి నొక్కాలి. చాతీ కనీసం 5 సెంటిమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి.
  • అలా ఒక నిమిషం పాటు సీపీఆర్ చేశాక పల్స్ చెక్ చేయాలి. ఒకవేళ అలా చేసినా పల్స్ దొరకలేదంటే సీపీఆర్ కంటిన్యూ చేయాలి. ఇలా చేస్తుంటే గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే గుండె పోటు వచ్చిన క్షణాల్లో సీపీఆర్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.
  • పిల్లలకు, శిశువులకు కూడా ఇదే పద్దతిలో సీపీఆర్ చేయాలి. అయితే పిల్లలకు సీపీఆర్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఛాతి మధ్యలో ఒక చేత్తోనే నొక్కాలి. శిశువుకి రెండు వేళ్లతో మాత్రమే మెల్లగా నొక్కుతూ ఉండాలి.

సీపీఆర్ చేస్తే లాభమేంటి?

  • గుండె పోటు వచ్చిన వాళ్లకు సీపీఆర్ చేయడం ద్వారా శ్వాస ఆగిపోకుండా చూసుకోవచ్చు.
  • హార్ట్ బీట్ ఆగిపోతే రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది.
  • సీపీఆర్ చేయడం వల్ల గుండెకు, గుండె నుంచి శరీరానికి రక్త సరఫరా తిరిగి పునరుద్ధరించబడుతుంది.
  • సీపీఆర్ చేస్తే గుండెపోటుకు గురైన వ్యక్తి 2 నిమిషాల్లోనే బతికే అవకాశం ఉంటుంది.

సీపీఆర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • రెండు చేతులను ఒకదానిపై ఒకటి పెట్టుకుని ఛాతి మధ్యలో పెట్టి నొక్కాలి.
    గుండె పై భాగంలో స్టెర్నమ్ అనే ఎముక మీద, ఛాతి మధ్యలో ఉండే మేనుబ్రియం అనే ఎముక మీద చేతులతో నొక్కుతూ ఒత్తిడి చేయాలి. ఒత్తిడి మరీ ఎక్కువ.. తక్కువ కాకుండా బ్యాలెన్సింగ్ గా చేయాలి.
  • సాధారణంగా గుండె పోటు వచ్చి చలనం లేకుండా కిందపడి ఉంటే చాలా మంది నోట్లో పోసే ప్రయత్నం చేస్తుంటారు. మెలకువ లేకుండా ఉన్న వ్యక్తి నోట్లో నీళ్లు పోస్తే ఆ నీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో పరిస్థితి మరింత విషమించే ఛాన్సులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Heart Attack | గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటి.. ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Heart attack | గుండెపోటు అని అనుమానం వస్తే ఈసీజీతో పాటు ఈ పరీక్షలు ఎందుకు చేస్తారు ?

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Exit mobile version