Home Lifestyle Devotional Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Image by Harryarts on Freepik

Lord Shiva | శివుడు నిరాకరుడు. ఆకారం లేని వాడు. అందుకే ఏ దేవాలయానికి వెళ్లినా కూడా మహాదేవుడిని లింగరూపంలోనే పూజిస్తారు. కానీ లింగధారుడైన పరమేశ్వరుడికి పంచముఖాలు ఉన్నాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను సూచిస్తాయి. ఐదో ముఖం ఊర్ధ్వ ముఖమై ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. ఆ ప్రతి శివాలయంలో ఈ ఐదు ముఖాలు కనిపిస్తాయి. ఈ ఐదు ముఖాలలో నుంచే సృష్టి, స్థితి, లయ, తిరోదానం, అనుగ్రహం (మోక్షం ) లభిస్తాయి.

పరమేశ్వరుడి పంచ ముఖాలు ఐదు ఆరామాలుగా అఘోరం ( అమరావతి ), తత్పురుష (ద్రాక్షారామం), వామదేవ (సామర్లకోట), సద్యోజాత (భీమవరం), ఈశాన (పాలకొల్లు) అనే నామాలతో ఆయా క్షేత్రాల్లో నెలకొని ఉన్నాయి. వీటిని శ్రీ మహావిష్ణువు, ఇంద్రాది దేవతలు ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి.

అమరామం

ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని అమరేశ్వరుడు అని పిలుస్తారు. ఇది అఘోర రూపం. ఏపీలోని గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇది అమరావతిగా ప్రసిద్ధి చెందింది. ఇక్క గర్భాలయం రెండు అంతస్థులు ఉంటుంది. పై అంతస్థు నుంచి అభిషేకం నిర్వహిస్తారు.

ద్రాక్షారామం

సూర్యుడు ప్రతిష్ఠించిన లింగం భీమేశ్వరుడు. ఇది తత్పురుష రూపం. తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో ఇది ఉంది. భీమేశ్వర లింగం భోగ లింగం. ప్రతిరోజు సుగంధ ద్రవ్యాలు కలిపిన జలంతో ఇక్కడి లింగాన్ని అభిషేకిస్తారు. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే భీమేశ్వర లింగం ఎత్తు పది అడుగులపైనే. ఇక్కడి అమ్మవారి పేరు మాణిక్యాంబ దేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి.

కుమారరామం

కుమారస్వామి ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని కుమార భీమేశ్వరుడు అని పిలుస్తారు. ఈ లింగం వామదేవ స్వరూపం. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట సమీపంలో ఈ ఆలయం ఉంది.

క్షీరారామం

శ్రీ మహావిష్ణువు ప్రతిష్ఠించిన లింగాన్ని క్షీరారామ లింగేశ్వరుడు అని పిలుస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఈశాన రూపుడిగా శివుడు దర్శనమిస్తాడు.

సోమారామం

ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడి సోమేశ్వరుడిది సద్యోజాత రూపం. ఈ ఆరామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Laxmi Devi | శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు

Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Exit mobile version