Home Lifestyle Horoscope & Vaasthu horoscope today | రాశిఫలాలు ( 17-01-2023 )

horoscope today | రాశిఫలాలు ( 17-01-2023 )

Image Source : Pixabay

horoscope today | మేషం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సమయానికి డబ్బు అందుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో ఏర్పడిన సమస్యలు పరిష్కరించుకుంటారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

వృషభం

వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు సేకరిస్తారు.

మిథునం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులను కలుసుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు పొందే సూచన ఉంది.

సింహం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య

జీవిత భాగస్వామితో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. ప్రముఖులను కలుస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

తుల

ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కోపతాపాాలకు దూరంగా ఉండండి. మౌనం అన్ని విధాలా ఉత్తమం. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. కుటుంబంలో ఒత్తిడులు ఎదురైనా అదిగమిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త పరచుకోండి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చికం

నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతాానం నుంచి ధనలాభం పొందుతారు

ధనుస్సు

కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకోని అతిథులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగ వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

మకరం

ఆర్థిక పరిస్థితిలో ఇబ్బందులు ఎదురైనా మిత్రుల సాయంతో అధిగమిస్తారు.అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కుంభం

మిత్రులతో కలహాలు ఏర్పడిన పరిష్కరించుకుంటారు. శ్రమ అధికం, రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలతో ముందుకుసాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మీనం

దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి సన్మాన యోగం ఉంది. సంతానాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version