Home Business Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు...

Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు జీతాలివ్వొచ్చట.. ఆక్స్‌ఫామ్ నివేదిక

Image Source : Pixabay

Oxfam Report | భారతదేశంలోని ఒక శాతం సంపన్నుల వద్ద 40 శాతానికి పైగా దేశ సంపద ఉంది. దేశ జనాభాలో సగం మంది వద్ద కేవలం 3 శాతం సంపద మాత్రమే ఉంది. ఇదేదో మాటలకు చెబుతున్నది కాదు.. భారతీయుల అసమానతలపై రైట్స్‌ గ్రూప్‌ ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ సర్వే సారాంశం. సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ పేరిట భారత్‌లోని ఆర్థిక అసమానతలపై సోమవారం ఆక్స్‌ఫామ్ నివేదిక విడుదల చేసింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం సందర్భంగా ఈ 5నివేదికను విడుదల చేసింది. ఇందులో పలు కీలక అంశాలను వెల్లడించింది.

భారత్‌లో ఉన్న టాప్ 100 మంది ధనవంతులపై 2.5 శాతం లేదా టాప్ 10లో ఉన్న ధనవంతులపై 5 శాతం పన్ను విధిస్తే దేశం మొత్తంలో బడి మానేసిన పిల్లలందరినీ తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు సమకూరుతుందని ఆక్స్‌ఫామ్ నివేదికలో వెల్లడించింది. గౌతమ్‌ అదానీ వద్ద 2017- 2021 కాలంలో పెరిగిన సంపదపై ఒకేసారి విధించే పన్నుతో రూ.1.79 లక్షల కోట్లు సమీకరించవచ్చని తెలిపింది. ఇది సంవత్సరానికి 50 లక్షల మంది ప్రైమరీ టీచర్లకు ఏడాది పాటు జీతాలు ఇచ్చేందుకు సరిపోతుందని తెలిపింది.

  • సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం భారతదేశంలోని బిలియనీర్ల వారి సంపదపై ఒకసారి 2 శాతం పన్ను విధిస్తే.. రూ. 40,423 కోట్ల సమకూరుతాయని, వీటితో మూడేళ్ల పాటు దేశంలో పోషకాహారంతో బాధపడుతున్న పిల్లలందరికీ పోషకాహారం అందించవచ్చని పేర్కొంది.
  • దేశంలోని టాప్ 10 మంది సంపన్నుల (రూ. 1.37 లక్షల కోట్లు)పై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే అది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు) మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ. 86,200 కోట్లు)ల బడ్జెట్లకు కంటే 1.5 రెట్లు ఎక్కువగాఉంటుందని తెలిపింది. ఒక పురుషుడు రూపాయి సంపాదిస్తే ఒక మహిళ కేవలం 63 పైసలు మాత్రమే సంపాదిస్తోందని తెలిపింది.
  • టాప్ 100 భారతీయ బిలినీయర్ల పై 2.5 శాతం పన్ను విధించినా లేక టాప్‌ 10 మంది భారతీయ బిలినీయర్ల పై 5 శాతం పన్ను విధిస్తే బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు సరిపోతుందని వివరించింది.
  • భారత్‌ లో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి 2022 నవంబర్‌ వరకు భారత్‌లోని ధనవంతల సంపద 121 శాతం పెరిగిందని పేర్కొంది. ఇది రోజుకు రూ.3608 కోట్లు ఉన్నట్లు ఆక్స్‌ఫామ్‌ వెల్డించింది.
  • భారత దేశంలో 2020నాటికి 102 మంది బిలినీయర్లు ఉండగా.. అది 2022 నాటికి 166 కి చేరింది. భారత దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్లకు చేరుకుందని నివేదికలో పేర్కొంది. ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌ కు 18 నెలలకు పైగా నిధులు సమకూర్చగలదని తెలిపింది.
  • ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ దేశంలోని అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు మరియు అనధికారిక రంగ కార్మికులు అవ్యవస్థలో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. పేదలు అసమానంగా ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నారు.
  • ధనికులతో పోల్చినప్పుడు నిత్యావసర వస్తువులు మరియు సేవలపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. సంపన్నులపై పన్ను విధించే సమయం ఆసన్నమైంది. వారు తమ న్యాయమైన వాటాను చెల్లించేలా చూడాలని అన్నారు. సంపద పన్ను మరియు వారసత్వ పన్ను వంటి ప్రగతిశీల పన్ను చర్యలను అమలు చేయాలని బెహర్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Exit mobile version