Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు ( 03-01-2023 )

Horoscope Today | రాశి ఫలాలు ( 03-01-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు వస్తాయి.

వృషభం

పనుల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

మిథునం

దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటా బయటా చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేసినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాల్లో అభివృద్ధి సాధిస్తారు. నూతన పెట్టుబడులకు తగిన సమయం. నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది.

సింహం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో లాభాలు పొందుతారు. పనులు నిదానంగా సాగుతారు. ఆదాయం అంతంతమాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ధనలాభ సూచన ఉంది.

కన్య

విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు అందుతాయి. శుభవార్తలు వింటారు.

తుల

పనుల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగుతాయి. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంటా బయటా ఏర్పడిన సమస్యలు తొలగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వస్తు లాభ సూచన ఉంది.

వృశ్చికం

వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు

ఉద్యోగ, వివాహ యత్నాలకు సానుకూలమైన సమయం. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వస్తువులు సేకరిస్తారు.

మకరం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలుగజేస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కుంభం

రుణాలు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. బంధువులతో కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనలాభ సూచన ఉంది.

మీనం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Exit mobile version