Home Lifestyle Devotional Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే...

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Image by azerbaijan_stockers on Freepik

Tuesday | మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఇవాళ హనుమంతునికి ప్రత్యేక పూజలు చేస్తే సమస్యలు దూరమవుతాయి. అలాగే మంగళవారం కుజ ( అంగారక ) గ్రహానికి సంబంధించినది. ఇవాళ కుజుడి చెడు దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెడు దృష్టి పడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా ఇంట్లో ప్రశాంతత కొరవడుతుంది. చికాకులు అధికమవుతాయి. కాబట్టి మంగళవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అప్పు తీసుకోవద్దు

హిందూ శాస్త్రాల ప్రకారం మంగళవారం అప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అప్పు చేస్తే తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది.

కొత్త బట్టలు కొనుగోలు చేయొద్దు

మంగళవారం కొత్త బట్టలు కొనడం గానీ.. ధరించడం గానీ చేయకూడదు. ఈ రోజు కొత్త బట్టలు ధరిస్తే అవి ఎక్కువ రోజులు ఆగవు. తక్కువ వ్యవధిలోనే ఏవేవో కారణాలతో చిరిగిపోయే అవకాశం ఉందని చాలామంది నమ్ముతారు.

హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవద్దు

మంగళవారం పొరపాటున కూడా హెయిర్ కటింగ్ గానీ షేవింగ్ గానీ చేయించుకోవద్దు. గోర్లు కూడా తీసుకోవద్దు. ఒకవేళ ఈ పనులు చేస్తే ఆయుష్షు క్షీణిస్తుందని పండితులు చెబుతుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. శారీరక సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది.

మసాజ్ చేయించుకోవద్దు

హెయిర్ కటింగ్‌తో పాటు మసాజ్‌, మాలిష్ వంటివి కూడా చేయించుకోవద్దు. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి వస్తుంది. అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో చికాకులు కూడా తలెత్తుతాయి.

కొత్త బూట్లు ధరించవద్దు

కుజుడికి శని దేవుడితో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి మంగళవారం కొత్త దుస్తులతో పాటు కొత్త షూ కూడా ధరించకూడదు. ఒకవేళ ఈ రోజు కొత్త బూట్లు వేసుకుంటే గాయాలు అయ్యే అవకాశం ఉందని పెద్దలు చెబుతుంటారు. డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని విశ్వసిస్తారు. కుజుడి ప్రభావంతో ఇంట్లో అగ్ని ప్రమాదాలు, దొంగతనం జరిగే ప్రమాదం ఉందని అంటారు. ఇంట్లో అనారోగ్య సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే మంగళవారం ఇలాంటి పనులను చేయొద్దని పెద్దలు చెబుతుంటారు. కుజుడికి నచ్చని ఈ పనులు చేయడం వల్ల అష్టకష్టాలు పడాల్సి వస్తుందని విశ్వసిస్తుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Secunderabad Club | జూబ్లీ బస్టాండ్‌ దగ్గరున్న సికింద్రాబాద్‌ క్లబ్‌ గురించి ఈ విషయాలు తెలుసా.. 20 ఏళ్లు నిరీక్షించినా సభ్యత్వం కష్టమే!

Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Vasthu Shastra | తులసి కోటను ఇంటికి ఏ దిక్కున ఉంచాలి?

Exit mobile version