Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (02-02-2023)

Horoscope Today | రాశిఫలాలు (02-02-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

గోప్యంగా వ్యవహరిస్తుంటారు. ముఖ్య కార్యక్రమాలు శుభకార్యాలు సానుకూల పరచుకోవడానికి మీరు చేసే కృషి మంచి మంచి ఫలితాలనిస్తుంది. వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు.

వృషభం

దూర ప్రాంతాల్లో విద్యావకాశాలు కలిసివస్తాయి. ముఖ్యమై చర్చలు వాయిదా పడతాయి. ఇతరుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

మిథునం

ఆర్థిక పరమైన అంశాలు లాభిస్తాయి. గృహం లేక భూమి కొనుగోలు సానుకూల పడుతుంది. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గాను అవకాశాలు కలిసివస్తాయి.

కర్కాటకం

వాహన సంబంధమైన విషయాలు వాయిదా వేయడం మంచిది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. అనుభవాలు నేర్పిన పాఠాలతో నేడు అనుకూల ఫలితాలను సాధిస్తారు.

సింహం

కొంత ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వపరమైన పనులను సానుకూల పరచుకోగలుగుతారు. లీజులు పొడింపబడతాయి. కీలక వ్యక్తుల నుంచి వాగ్దానాలు అందుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు.

కన్య

మీస్థాయి పెరుగుతుంది. మనస్సులోని భావాలను పరోక్షంగా బంధువర్గానికి తెలియజేస్తారు. ఇరుగుపొరుగు వారితతో విబేధాలు చెప్పుకోదగినవి కాకపోయినా చికాకు కలిగిస్తాయి.

తుల

ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గాక ఇతరత్రా వ్యాపారాల్లో కూడా విస్తరించాలనే ఆలోచన మీలో కలుగుతాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి పేరు పొందుతారు.

వృశ్చికం

నిర్దయగా వ్యవహరిస్తున్న వారి పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. వినోద కార్యక్రమాల కన్నా అభివృద్ధికి ప్రాముఖ్యతనిస్తారు. స్వల్ప ధన లాభ సూచన ఉంది. కొనుగోలు, అమ్మకాలు సాగిస్తారు.

ధనుస్సు

గౌరవ ప్రదమైన పురస్కారాలు అందుకుంటారు. క్రమశిక్షణాయుతంగా మెలుగుతారు. సందర్బోచితంగా వ్యవహరించి లాభపడతారు. అనవసరమైన విషయాలతో కాలాన్ని వృథా చేయరు.

మకరం

ట్రాఫిక్ రూల్స్ పాటించడం చెప్పదగినది. వృత్తి, ఉద్యోగాలపరంగా అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ సాధించడానికి గానూ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మనో ప్రశాంతతను కలిగి ఉంటారు.

కుంభం

అదృష్టానికన్నా కృషిని నమ్ముకుంటారు. వస్తు భద్రత పట్ల జాగ్రత్తలు అవసరం. మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు. టెండర్స్ లాభిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది.

మీనం

ఆర్థికంగా మరింత పురోగతిని సాధించడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. కిందపడ్డ తమదే పైచేయి అనేవారితో జాగ్రత్తగా వ్యవహరించండి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version