Home Entertainment Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.....

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Salman khan birth day celebrations | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మంగళవారం 57వ పుట్టిన రోజున ఘనంగా జరుపుకున్నాడు. బర్త్ డే వేడుకలను ఆయన సోదరి అర్పితా ఖాన్ తన నివాసంలో గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశాడు. చాలా కాలం తర్వాత ఇద్దరూ ఖాన్‌లు ఒకే చోట కలవడంతో అభిమానులు మురిసిపోయారు. ఇక ఇదిలా ఉంటే ఈ వేడుకలో సల్మాన్ ఖాన్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు.

ఇంతకీ ఏం పని చేశాడు అనుకుంటున్నారా? కాగా ఈ బర్త్ డే వేడుకకు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు సంగీతా బిజ్లానీ కూడా వచ్చింది. పార్టీ అనంతరం సంగీత వెళ్తుంటే సాగనంపడానికి సల్మాన్ బయటకు వచ్చాడు. కార్ వచ్చేలోపు మాజీ ప్రియురాలితో కాసేపు ముచ్చటించాడు. ఆ తర్వాత ఆమె నుదిటిపై ముద్దు పెట్టాడు. అంతేకాకుండా మాజీ ప్రియురాలి కారు డోర్ కూడా తనే తీశాడు. ఇక ఇంకేముంది ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.

సల్మాన్ చూపించిన ప్రేమకు నెటీజన్లు ఫిదా అవుతున్నారు. సో స్వీట్, దటీజ్ సల్మాన్ భాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వేడుకకు పూజాహెగ్డే, టబు, కార్తిక్ అయాన్ సహా పలువురు సెలబ్రెటీలు బర్త్ డే పార్టీలో సందడి చేశారు.

Exit mobile version