Home Entertainment Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా?...

Outside food in cinema halls | సినిమా హాళ్లలోకి బయటి ఫుడ్‌ తీసుకెళ్లొచ్చా? లేదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Outside food in cinema halls | సినిమా హాళ్లు, థియేటర్లలోకి బయటి నుంచి తినుబండారాలు తీసుకెళ్లవచ్చా? లేదా? అన్న అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు యజమానుల ప్రైవేటు ఆస్తి కాబట్టి ప్రేక్షకులు బయటి నుంచి ఆహార పదార్థాలు తీసుకురాకుండా నిషేధించే హక్కు వాళ్లకు ఉంటుందని వెల్లడించింది. అయితే చిన్నారులు, పిల్లల కోసం ఆహారం తెచ్చుకునే తల్లిదండ్రులను అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అలాగే ప్రేక్షకులు అందరికీ ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. థియేటర్లలోకి బయటి నుంచి తీసుకొచ్చే ఆహారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ జమ్మూకశ్మీర్‌ హైకోర్టు 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ మేరకు తీర్పునిచ్చింది. ప్రేక్షకుడికి ఎక్కడ సినిమా చూడాలో ఎంచుకునే హక్కు ఉన్నట్లుగానే, థియేటర్‌ యజమానులకు బయటి ఆహారంపై షరతులు విధించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. హెల్తీ ఫుడ్‌ అందించడానికి సినిమా హాళ్లు ఏమీ జిమ్‌లు కాదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అలా అని థియేటర్‌ లోపల అమ్మే ఆహార పదార్థాల కొనుగోలుపై ప్రేక్షకులను బలవంతం చేయకూడదని సూచించింది. అయితే అక్కడ ఉన్న వాటిని కొనుగోలు చేయాలా ? వద్దా? అనేది ప్రేక్షకుడి విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా పలు ఉదాహరణలతో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ‘ సినిమా చూసేందుకు వచ్చిన ఎవరైనా వ్యక్తి బయటి నుంచి జిలేబీ తీసుకెళ్లినప్పుడు పరిస్థితి ఏంటి? జిలేబీ తిని చేతికి ఉన్న పాకం సీట్లకు తుడిస్తే.. దాని క్లీనింగ్‌కు డబ్బు ఎవరిస్తారు? ఇక ప్రేక్షకులు సినిమా హాల్లోకి తందూరీ చికెన్‌ తీసుకెళ్లి తిన్న తర్వాత బొక్కలు అక్కడే పడేస్తే ఎలా? ఇది కూడా తోటి ప్రేక్షకులకు ఇబ్బంది పెట్టే అంశమే కదా’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

NTR 30 | ఎన్టీఆర్ 30పై ఆసక్తికరమైన అప్‌డేట్.. కొరటాలకు టెన్షన్ తప్పదా..?

Unstopabble with NBKS2 | పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ దాని గురించే ప్రత్యేకంగా అడిగారా..?

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Samantha | జీవితం ఇంతకుముందులా లేదు.. వైరల్‌గా మారిన సమంత కామెంట్

Exit mobile version