Home News Telangana Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్‌లోనే మృతి

Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్‌లోనే మృతి

Metro Station | హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది. మహబూబ్ నగర్‌ జిల్లా మక్తల్ గ్రామానికి చెందిన మారెమ్మ అర్ధరాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ నుంచి దూకింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన యువతిని మహబూబ్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇదే తరహాలో ఈఎస్ఐ మెట్రో స్టేషన్ నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Delhi Accident | ఢిల్లీ తరహాలో ఆగ్రాలో మరో యాక్సిడెంట్‌.. రాత్రంతా వాహనాలు పోవడంతో నుజ్జునుజ్జయిన బాడీ..

Hombale Films Journey | మూడు వేల కోట్లతో హోంబలే ఫిలింస్ భారీ ప్లాన్.. ఈసారి కేజీఎఫ్, కాంతారను మించిపోవాల్సిందే !

Numaish 2023 | హైదరాబాద్‌లో జరిగే అతిపెద్ద ఎగ్జిబిషన్‌ నుమాయిష్‌ గురించి ఈ విషయాలు తెలుసా ? ఎంట్రీ ఫీజు ఎంతంటే?

Jeremy Renner | బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. తీవ్రంగా గాయపడ్డ అవెంజర్స్ ఫేమ్ మార్వెల్ సూపర్ హీరో జెరెమీ రెన్నర్‌.. పరిస్థితి విషమం

Karimnagar Mystery Deaths | గంగాధరలో అనుమానాస్పద మరణాల మిస్టరీలో ట్విస్ట్.. భర్తే ముగ్గుర్ని చంపేశాడా?

Exit mobile version