Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశి ఫలాలు ( 28-12-2022 )

Horoscope Today | రాశి ఫలాలు ( 28-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు తొలగి ఊరట పొందుతారు

వృషభం

పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి విద్య అవకాశాలు లభిస్తాయి.

మిథునం

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. ఉద్యోగులు కొత్త హోదాలు పొందే అవకాశం ఉంది. వాహన యోగ సూచన ఉంది.

కర్కాటకం

శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. బాధ్యతలు పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు.

సింహం

పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయట ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

కన్య

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

తుల

కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

ఇంటాబయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. ఆర్థికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.

మీనం

రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూ క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

Follow Us : FacebookTwitter

Read More :

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

Salman khan birth day celebrations | మాజీ ప్రియురాలికి ముద్దు పెట్టిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్

Kantara 2 | కాంతార 2 వస్తుందా.. సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌

Exit mobile version