Home Entertainment Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక...

Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!

Kushboo Sundar | ఎనిమిదో ఏటనే లైగింక వేధింపులకు గురయ్యానని, అది కూడా కన్న తండ్రి చేతిలోనే అని సినీనటి ఖష్బూ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి ఖుష్బూ స్పందించారు.

“నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి నేను ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. కు జరిగిన అన్యాయం గురించి అందరికీ ధైర్యంగా తెలియజేశాను. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది” అని అన్నారు. అసలు ఆ విషయం గురించి చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదంటూ వ్యాఖ్యానించారు. నా పై ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి సిగ్గుపడాలి కానీ అన్యాయానికి గురైన నేను కాదు అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా మహిళలందరూ కూడా ఎంతో ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలని ఖష్బూ పిలుపునిచ్చారు. మనల్ని కించపరిచే వాటిని ఎప్పుడూ కూడా ప్రోత్సహించకూడదన్నారు. అయితే “
నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాను. నేను తెలియజేసినట్లే ప్రతి ఒక్కరూ కూడా తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టాలి. ధైర్యంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలి” అని కోరుకుంటున్నట్లు ఆమె వివరించారు.

ఖుష్బూ ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది. కన్న తండ్రి నుంచే లైంగిక వైధింపులకు బలైనట్లు తెలిపింది. ఆ సమయంలో ఎనిమిది సంవత్సరాలున్నానని, ఎదిరించలేకపోయానని, కానీ పదిహేను సంవత్సరాలు వచ్చాక తండ్రిని ఎదిరించినట్లు చెప్పుకొచ్చారు. దాంతో తన తండ్రి ఫ్యామిలీని వదిలి వెళ్లిపోయాడని తెలిపింది. లైంగిక వేధింపులపై ప్రస్తుతం కుష్బూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Viral News | బైక్‌ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

Elon Musk | మస్క్‌ బాత్ రూంకి వెళ్లాలన్న వాళ్లు ఉండాల్సిందేనట.. !

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Bill Gates Drives Auto | ఆటో నడిపిన బిల్ గేట్స్.. రియాక్షన్‌ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా.. ఏంటా ఆటో స్పెషల్‌?

Exit mobile version