Home News AP YS Jaganmohan Reddy | వందేళ్ల తర్వాత భూ సర్వే చేస్తున్నాం.. నాణ్యతతో జరగాలి: ఏపీ...

YS Jaganmohan Reddy | వందేళ్ల తర్వాత భూ సర్వే చేస్తున్నాం.. నాణ్యతతో జరగాలి: ఏపీ సీఎం జగన్‌

YS Jaganmohan Reddy | వందేళ్ల తర్వాత భూ సర్వే చేస్తున్నామని, వాటి ఫలాలు కచ్చితంగా ప్రజలకు అందాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ సర్వే ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలన్న సీఎం.. భూముల సర్వే అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని అన్నారు. సర్వే కచ్చితంగా నాణ్యతతో జరగాలని అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై అమరావతిలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలి విడతలో సర్వే పూర్తయిన 2 వేల గ్రామాలకు సంబంధించిన భూ హక్కు పత్రాలు అందించే కార్యక్రమాన్ని జనవరి నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూ సర్వేకు అవసరమైన సర్వే రాళ్ల ఉత్పత్తి పెంచాలన్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులు సర్వే రాళ్ల ఉత్పత్తి పెరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కాగా, 2023 ఫిబ్రవరి 15 నాటికి సర్వే పూర్తి చేస్తామని, అదే నెలలో భూహక్కు పత్రాలు కూడా అందజేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.

మరోవైపు రాష్ట్రంలో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కావాల్సినంత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకొని, ఖాళీలున్న చోట వెంటనే నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

CESS Elections | సెస్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయం.. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తోందన్న బండి సంజయ్‌

AP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు

Srisailam | శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

Exit mobile version