Home Lifestyle Health Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత పొట్టపై మచ్చలు అలాగే ఉంటున్నాయా?

Stretch marks after pregnancy | డెలివరీ తర్వాత చాలామంది మహిళలు కామన్‌గా ఎదుర్కొనే సమస్య పొట్టపై చారికలు లేదా మచ్చలు. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట పెరగడం వల్ల ఏర్పడిన చారికలు ఏర్పడుతుంటాయి. చర్మం బాగా సాగి మళ్లీ యథాస్థితికి వచ్చినప్పుడు ఏర్పడిన ఈ గీతలు దాదాపుగా అలాగే ఉండిపోతుంటాయి. వీటిని తొలగించుకునేందుకు మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల క్రీములు కూడా ట్రై చేస్తారు. ఆ రసాయనిక లేపనాల కారణంగా ఒక్కోసారి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి అలాంటి రసాయనాలేవీ లేకుండా ఇంట్లో దొరికే వస్తువులతోనే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

➣ కోడిగుడ్డు ఆరోగ్యానికే కాదు.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన స్ట్రెచ్‌ మార్క్స్‌ను పోగొట్టడంలోనూ సహాయపడతాయి. ఎగ్స్‌లో ఉండే విటమిన్‌ ఏ, ప్రోటీన్స్‌, అమైనో యాసిడ్స్‌ వంటివి చర్మ కణాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం నిగారించేలా చేస్తాయి. అందుకే చారికలు ఉన్న చోట కోడిగుడ్డ సొనను తరచూ రుద్దుకుంటే మచ్చలు దూరమవుతాయి.

➣ ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చి స్ట్రెచ్‌ మార్క్స్‌ లేదా చారికలను పోగొట్టడంలో అలోవెరా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అలోవెరా జెల్‌లో అలోసిన్‌ ఉంటుంది. ఇది స్ట్రెచ్‌ మార్క్స్‌పై తన మార్క్‌ చూపిస్తుంది. కాబట్టి అలోవెరా జెల్‌లో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రోజూ పడుకునే ముందు రాసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిరోజులు చేస్తే మచ్చలు పోతాయి.

➣ ఆలివ్‌ ఆయిల్‌, బాదం ఆయిల్‌తో మసాజ్‌ చేయడం ద్వారా కూడా స్ట్రెచ్‌ మార్క్స్‌ పోయి చర్మం ఎప్పటిలా అవుతుంది. ఆలుగడ్డలను గ్రైండ్‌ చేసి ఆ రసాన్ని చారికలు ఉన్న చోట రుద్దితే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. తక్కువ సమయంలోనే స్ట్రెచ్‌ మార్క్స్‌ తొలగిపోతాయి.

➣ నిమ్మచెక్కతో తరుచూ రుద్దుకుంటే కూడా ప్రతిఫలం ఉంటుంది. చక్కెరలో కొంచెం నిమ్మరసం, బాదం ఆయిల్‌ కలిపి రుద్దుకుంటే కూడా చారికలు పోతాయి.

➣ రోజ్‌వాటర్‌లో కొద్దిగా నిమ్మరసం, తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పొట్టపై వేసి మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే చారికలు తొలగిపోతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

Hair fall | రాత్రి పూట తలస్నానం చేస్తున్నారా? బట్టతల వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ BF.7 లక్షణాలివే..

Is eggs good in winter | చలికాలంలో గుడ్లను తినడం మంచిదేనా?

Exit mobile version