Home Lifestyle Horoscope & Vaasthu Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | మనం ఉండే ఇంటికి, వాస్తుకి సంబంధం ఉంటుందని చాలామంది నమ్ముతుంటారు. ఇల్లు వాస్తు సరిగ్గా ఉంటేనే అందులో ఉండేవారి ఆరోగ్యం బాగుంటుందని.. సంతోషంగా ఉంటుందని అంటారు. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు కడుతుంటారు. అయితే ఇల్లు ఒక్కటే కాదు.. ఇంటి స్థలం చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా వాస్తును ప్రభావితం చేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉంటే అరోగ్యపరంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి అవేంటో ఒకసారి చూద్దాం..

  • ఇల్లు కట్టడానికి ముందు స్థలం కూడా వాస్తు ప్రకారం ఉండాలి. మూలలు సమానంగా ఉండాలి.
  • స్థలానికి వీధిపోటు, వీధిశూల ఉండకూడదు. తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం, పడమర నైరుతి, దక్షిణ నైరుతి ఎదురుగా వీధిపోటు, వీధిశూల ఉండటం మంచిది కాదు.
  • మూడు వీధులు, మూడు రోడ్లు కలిసే ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదు. అటువంటి ప్రదేశాల్లో నివసించే వారు ఎప్పుడూ మంచి ఫలితాలు పొందలేరు.
  • ఇల్లు కట్టుకునే స్థలం లోతట్టు ప్రాంతంలో ఉండకూడదు. కాలువలు, చెరువుల దగ్గర కూడా మన స్థలం లేకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే భారీ వర్షాలు కురిసినప్పుడు వరద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • శ్మశానాలకు దగ్గరలో ఇల్లు కట్టుకోవద్దు. అలాంటివాటికి దగ్గరలో ఉంటే జీవితంపై వైరాగ్యం, నిరాశ, నిస్పృహలు కలిగే అవకాశం ఉంటుంది.
  • ఇంటి దగ్గర మతపరమైన స్థలాలు ఉండకూడదు. ఆలయాలు, మసీదులు, చర్చిలు ఉన్న ప్రాంతాలు పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. కానీ వాస్తు ప్రకారం అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ ఉండేవారిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి.
  • ఆస్పత్రులకు సమీపంలో కూడా ఇల్లును కట్టుకోవద్దు. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. దీని ప్రతికూలత ప్రభావం అక్కడి చుట్టుపక్కల వారిపై పడే అవకాశం ఉంటుంది.
  • పాడుబడిన భవంతుల సమీపంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటికి సమీపంలో పాత భవనాలు కూడా ఉండకుండా చూసుకోవాలి.
  • ప్రమాదకర పరిశ్రమలకు దగ్గరలో స్థలాన్ని కొనుగోలు చేయడం కూడా అంతమంచిది కాదు. అక్కడి ప్రాంతం చాలావరకు కలుషితమై ఉంటుంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
  • స్థలం కొనుగోలు చేసే ముందు అక్కడ నీటి లభ్యత ఎలా ఉందో తెలుసుకోవాలి. బోరు బావి ఈశాన్యంలో ఉండాలి.
  • తూర్పు, ఉత్తరం, పశ్చిమం, దక్షిణం ఈ నాలుగు దిక్కుల్లో సింహద్వారం ఎటువైపు ఉన్న మంచిదే. కానీ తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం మూలల్లో సింహద్వారం ఏర్పాటు చేయొద్దు
  • తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, పశ్చిమ వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం వాస్తురీత్యా మంచిది.
  • కిచెన్ ఆగ్నేయ, వాయువ్య మూలల్లోనే ఉండాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version