Home Entertainment Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Ramcharan | సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్ అయిపోయాడు రామ్ చరణ్. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ దర్శకులు, అక్కడి టెక్నీషియన్స్‌తో బాగా మింగిల్ అయిపోతున్నాడు మెగా వారసుడు. తాజాగా మరోసారి ఇదే చేశాడు ఈయన. బాలీవుడ్ టాప్ కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్యతో రామ్ చరణ్ చేసిన డాన్సింగ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వైరల్ కాదు.. దాన్ని చూసి మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మాలలో ఉన్న చరణ్.. గణేష్ ఆచార్యతో కలిసి మై ఖిలాడీ తు అనారీ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అందులో గణేష్ కంటే చరణ్ స్టెప్పులు బాగా హైలైట్ అయ్యాయి.

ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ ఆడియన్స్‌కు చేరువైన చరణ్.. తాజాగా గణేష్ వీడియోతో మరింత వైరల్ అయిపోయాడు. ఒకప్పటి ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచిన మై ఖిలాడీ తు అనారి పాటను తాజాగా అక్షయ్ కుమార్ సెల్ఫీ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించాడు. ఈయన తన పాటలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే సెలబ్రిటీస్‌తోనూ డాన్స్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు, రామ్ చరణ్‌తో కలిసి సెల్ఫీ రీమిక్స్ సాంగ్‌కు స్టెప్పులేశాడు గణేష్.

అది కాస్తా దుమ్ము దులిపేస్తుంది. రామ్ చరణ్ ఎంత మంచి డాన్సర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవపరం లేదు. గణేష్ ఆచార్య వీడియోలోనూ తన పర్ఫెక్ట్ స్టెప్పులతో రప్ఫాడించాడు మెగా వారసుడు. ఇదిలా ఉంటే ఈయన ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరి 12 వరకు హైదరాబాద్‌లోనే జరిగింది. తాజాగా వైజాగ్‌కు షిఫ్ట్ అయింది. అక్కడే మరో 10 రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. జూన్ లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు రామ్ చరణ్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Exit mobile version