Home Entertainment Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Gaalodu movie in aha | సుడిగాలి సుధీర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్‌ కామెడీ షోతో సుధీర్‌కు వచ్చినంత క్రేజ్‌ ఇంకా ఎవరికీ రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా యాంకర్‌ రష్మీ గౌతమ్‌తో అతని లవ్‌ ట్రాక్‌ జనాలకు బాగా ఎక్కేసింది. టాలెంట్‌కు తోడు రష్మితో కెమిస్ట్రీ సుడిగాలి సుధీర్‌ను పాపులర్‌ చేశాయి. ఈ క్రేజ్‌తోనే ఇప్పుడు ఈయన సినిమాల్లోనూ ట్రై చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ సుధీర్ సినిమాతో హీరోగా మారిన సుడిగాలి సుధీర్‌ ఇప్పుడు సినిమాలతోనూ బిజీ అవుతున్నాడు.

సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ తర్వాత త్రీమంకీస్‌, వాంటెడ్‌ పండుగాడ్‌ సినిమాలు చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో మాస్‌ యాంగిల్‌ ట్రై చేస్తూ రీసెంట్‌గా గాలోడు సినిమాతో ఆడియన్స్‌ ముందుకొచ్చాడు. పులిచర్ల రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. సుడిగాలి సుధీర్‌ కెరీర్‌లోనే ఈ సినిమా బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. నవంబర్‌ 18న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ఇప్పటికే తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సుడిగాలి సుధీర్ గాలోడు సినిమాను థియేటర్‌లో చూడటం మిస్సయిన ప్రేక్షకులు వెంటనే సినిమాను చూసేయండి మరి.!

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Rana Daggubati | దగ్గుబాటి సురేశ్, రానాలపై క్రిమినల్ కేసు.. కోర్టుకు హాజరుకావాలని సమన్లు

Pawan Kalyan | అన్నయ్య తుపాకీతో కాల్చుకుని చనిపోదామనుకున్నా.. సంచలన విషయం బయపెట్టిన పవన్‌ కళ్యాణ్‌

Prabhas – Kriti Sanon | మాల్దీవుల్లో ప్రభాస్‌తో కృతిసనన్‌ ఎంగేజ్‌మెంట్‌.. అసలు నిజమిదీ !!

Samyuktha | మా నాన్న పేరు అడ్డుగా అనిపించింది.. అందుకే తీసేస్తున్నా.. మలయాళ బ్యూటీ సంయుక్త సంచలన నిర్ణయం

Exit mobile version