Home Entertainment Taraka ratna health update | తారకరత్న హెల్త్ విషయంలో దోబూచులాట ఆడుతున్నారా..?

Taraka ratna health update | తారకరత్న హెల్త్ విషయంలో దోబూచులాట ఆడుతున్నారా..?

Taraka ratna health update | తారకరత్న హెల్త్ విషయంలో దోబూచులాట ఆడుతున్నారా.. ఇప్పుడు అందరికీ ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. ఎందుకంటే తారకరత్న ఆరోగ్యం విషయంలో బయట జరుగుతున్న ప్రచారానికి.. డాక్టర్లు చెప్తున్న దానికి ఎక్కడా పొంతన లేదు. పైగా పది రోజులుగా తారకరత్న హెల్త్ బులిటెన్స్ కూడా విడుదల కాలేదు. అసలు ఆయనెలా ఉన్నాడనే విషయాన్ని కూడా ఎవరూ చెప్పట్లేదు.. చెప్పడానికి ముందుకు రావడం లేదు.. ఆసక్తి కూడా చూపించడం లేదు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందుకుంటున్న తారకరత్న ఆరోగ్యంపై ఉన్న అనుమానాలు ఎవరు తీరుస్తారనేది కూడా అర్థం కాని చిక్కు ప్రశ్నే.

ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు అబ్బాయి హెల్త్ కోసం బాబాయ్ బాలయ్య తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకోవడం లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. అనిల్ రావిపూడి సినిమాను మూడు వారాల తర్వాత పెట్టుకుందాం అని చెప్పారు బాలయ్య. ఇవన్నీ పక్కనబెడితే అసలు తారకరత్న ప్రస్తుత హెల్త్ కండీషన్ ఏంటనేది ఎవరూ క్లారిటీగా చెప్పట్లేదు. జనవరి 27న లోకేష్ పాదయాత్ర తొలిరోజే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు తారకరత్న.

అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈయన మూసిన కన్ను మూసినట్లే ఉంది కానీ తెరవలేదనేది కాదనలేని సత్యం. ఆయన గుండెతో పాటు ఇతర అవయవాలు బాగానే పని చేస్తున్నా.. కీలకమైన మెదడు మాత్రం అంతగా వర్క్ చేయడం లేదని డాక్టర్లు కూడా చెప్పారు. దాన్ని రికవరీ చేయడానికే ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి వైద్యులు వచ్చారు. వాళ్లతో కూడా చర్చించిన తర్వాత ఎలాంటి ట్రీట్ మెంట్ ఇవ్వాలనేది ఆలోచించనున్నారు ఇక్కడి డాక్టర్లు.

మరోవైపు తారకరత్న హెల్త్ గురించి నందమూరి కుటుంబ సభ్యులను ఎవర్ని అడిగినా కూడా వాళ్లైతే పెద్దగా స్పందించడం లేదు. పైగా తాము డాక్టర్స్ కాదు చెప్పడానికి అంటున్నారు. ఎలా ఉన్నాడో చెప్పడానికి వైద్యులే కానవసరం లేదు కదా అనేది కామన్ జనంకు ఉండే అనుమానం. కుటుంబ సభ్యుడిగా ఎలా ఉన్నాడు అని తెలుసుకుని చెప్పడం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ చెప్పడానికి ముందుకు రావడం లేదు.. అడిగిన ప్రతీసారి వైద్యులే చెప్తారు అంటూ తప్పించుకుంటున్నారు.

ఇక్కడే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. మొత్తానికి ఒక్కటైతే నిజం.. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం అంతే విషమంగా ఉంది. మరి దాన్నుంచి ఆయనెప్పుడు బయట పడతాడో చూడాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ramcharan | ఆ కొరియోగ్రఫర్‌తో కలిసి మెగా ట్రీట్ ఇచ్చిన రామ్ చరణ్..

Nayanthara | నా భర్తనే అవమానిస్తారా? ఆ హీరోతో జన్మలో నటించను.. మంగమ్మ శపథం పట్టిన నయనతార?

Actress Hema | కొత్త బిజినెస్‌ పెట్టా.. అందుకే సినిమాలు మానేశా.. అసలు విషయం చెప్పిన హేమ

Jagapathi babu | ఏమైందో తెలియదు.. పోగొట్టుకున్నా ఆస్తులపై నోరువిప్పిన జగపతిబాబు..

Gaalodu movie in aha | ఓటీటీలోకి వచ్చేస్తున్న సుడిగాలి సుధీర్‌ గాలోడు సినిమా

Ileana | ఇలియానాపై సౌత్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాన్.. పదేళ్లుగా అందుకే టాలీవుడ్‌కు దూరమైన గోవా బ్యూటీ

Exit mobile version