Home Entertainment Rajinikanth | నరసింహ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రజినీకాంత్ కాదు.. బాలయ్య కోసం రాసుకుంటే తలైవా...

Rajinikanth | నరసింహ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రజినీకాంత్ కాదు.. బాలయ్య కోసం రాసుకుంటే తలైవా ఎలా వచ్చాడంటే?

Rajinikanth | సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వాటిలో ఇష్టమైన రెండు, మూడు సినిమా పేర్లు చెప్పమని ఎవరిని అడిగిన బాషా, నరసింహ సినిమా పేర్లు కచ్చితంగా చెబుతారు. రజినీకాంత్‌ను బాషా సూపర్‌స్టార్‌ను చేస్తే.. నరసింహ సినిమా కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. రజినీకాంత్‌ను తప్ప నరసింహ క్యారెక్టర్‌లో వేరే హీరోను ఊహించుకోలేనంతగా జీవించేశాడు. నా దారి.. రహదారి అంటూ ఈ సినిమాలో రజినీ డైలాగ్ చెప్పే మేనరిజం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రజినీకాంత్ కాదు అంట. టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఈ సినిమా స్టోరీని రాసుకుంటే అది చివరకు రజినీకాంత్ చేతికి వెళ్లిపోయింది.

ఇంతకీ నరసింహ కథ మిస్సయిన ఆ టాలీవుడ్ హీరో ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదండీ.. మన బాలయ్య బాబు. నందమూరి బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయిత చిన్నికృష్ణ నరసింహ కథను రాశాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ బి.గోపాల్‌‌కు స్టోరీ వినిపించాడు. బాలయ్యతో చేస్తే అదిరిపోతుందని చెప్పాడు. కథ విన్నాక బి.గోపాల్ కూడా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. కానీ అప్పటికే బాలయ్యతో బి.గోపాల్ సమరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాత చూద్దాంలే.. అప్పటిదాకా ఆగమని చిన్నికృష్ణకు బి.గోపాల్ చెప్పాడు. చిన్నికృష్ణ రెడీ చేసిన స్క్రిప్టు గురించి అతని స్నేహితుల ద్వారా కోలీవుడ్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌కు తెలిసింది. వెంటనే చిన్ని కృష్ణ దగ్గరకు వచ్చి ఆ స్క్రిప్ట్ మొత్తం చదివాడు. కేఎస్ రవికుమార్‌కు కూడా స్టోరీ బాగా నచ్చేసింది. దీంతో రజినీకాంత్‌తో ఈ సినిమా చేస్తానని చిన్నికృష్ణను స్క్రిప్ట్ ఇవ్వమని అడిగాడు.

బాలకృష్ణతో చేద్దామని చిన్ని కృష్ణ ఆశపడ్డప్పటికీ ఆ టైమ్‌లో అది కుదిరేలా కనిపించలేదు. ఆ టైమ్‌లో సమరసింహారెడ్డి, సుల్తాన్, కృష్ణ బాబు, వంశోద్ధారకుడు, గొప్పింటి అల్లుడు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. దీంతో బాలయ్యతో స్క్రిప్టు చేయడం కుదరదని భావించి కేఎస్ రవికుమార్‌కు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో చిన్ని కృష్ణ దగ్గర తీసుకున్న స్క్రిప్ట్‌తో రజినీకాంత్‌ను హీరోగా పెట్టి తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. పడియప్ప టైటిల్‌తో రిలీజైన ఈ సినిమాలో కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. నరసింహ పేరుతో డబ్ అయ్యి తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో రజినీకాంత్ డైలాగ్ డెలివరీ, మేనరిజం ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాలో నీలాంబరి పాత్రతో రమ్యకృష్ణకు కూడా మంచి పేరొచ్చింది. ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఈ సినిమా కనుక బాలయ్య చేసి ఉంటే మరో రేంజిలో ఉండేదని అనుకుంటున్నారు. ఏదేమైనా బాలకృష్ణ మంచి ఛాన్స్ మిస్సయ్యాడని ఫీలవుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?

NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్‌గా చనిపోతున్నారెందుకు?

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

Exit mobile version