Home Entertainment Mega Princes | తల్లిదండ్రులైన రామ్‌చరణ్‌, ఉపాసన.. మెగా ప్రిన్సెస్‌కు వెల్‌కమ్‌ చెబుతూ సోషల్‌మీడియాలో రచ్చ

Mega Princes | తల్లిదండ్రులైన రామ్‌చరణ్‌, ఉపాసన.. మెగా ప్రిన్సెస్‌కు వెల్‌కమ్‌ చెబుతూ సోషల్‌మీడియాలో రచ్చ

Mega Princes | మెగా ఫ్యామిలీలోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది. రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.. లిటిల్‌ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం పలుకుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కోట్లాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావు.. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశారు.

పెండ్లయిన దాదాపు పదేండ్లకు చెర్రీ, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సోషల్‌మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం చెబుతూ పోస్టులు పెడుతున్నారు. చెర్రీ, ఉపాసనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. దీంతో పాటు మెగా ఫ్యామిలీ ఎంత సంతోషంలో ఉంటుందో తెలియజేసేలా ఫన్నీ ఫన్నీ మీమ్స్‌ చేసి ట్విట్టర్‌లో పోస్టు చేస్తున్నారు. లయన్‌ కింగ్‌ సినిమాలో సింబా క్యారెక్టర్‌ను బాహుబలి రేంజ్‌లో ఇంట్రడ్యూస్‌ చేసే సీన్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్‌చరణ్‌, ఉపాసన జంటకు పాప పుట్టడం వల్ల అత్యంత సంతోషంగా ఉండేది అల్లు అర్జున్‌ కొడుకు అయాన్‌ అని పోస్టులు పెడుతున్నారు. ఖుషీ సినిమాలో చిన్న పిల్లల సీన్‌, గంగోత్రి సినిమాలో వల్లంకి పిట్ట సాంగ్‌ను పోస్టు చేస్తూ రచ్చ లేపుతున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Advantage of cycle | సైకిల్ గురించి ఈ విశేషాలు తెలుసా? సైకిల్ వాడితే బీపీ, షుగర్ ను కంట్రోల్ చేయొచ్చా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Bill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ ఫోన్ మాత్రం అస్సలు కాదు!

Exit mobile version