Tuesday, April 23, 2024
- Advertisment -
HomeNewsAPVishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన...

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

Vishal | కోలీవుడ్ హీరో విశాల్‌కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. తమిళనాట స్టార్ హీరో అయినప్పటికీ విశాల్ ఫ్యామిలీది తెలుగు కుటుంబమే. ఆయన తండ్రికి చిత్తూరు జిల్లాతో మంచి అనుభవం ఉంది. దీంతో ఏపీ రాజకీయాల్లోకి విశాల్ రాబోతున్నాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయబోతున్నట్టు ఇటీవల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో తన రాజకీయ ఎంట్రీపై విశాల్ క్లారిటీ ఇచ్చాడు.

విశాల్ నటించిన తాజా చిత్రం లత్తి. తెలుగులో లాఠీ పేరుతో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అనూహ్య స్పందన వస్తుంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో చెన్నైలో చిత్ర ప్రమోషన్‌లో విశాల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమిచ్చాడు. తాను రాజకీయాల్లోకి రావడం పక్కా అని విశాల్ క్లారిటీ ఇచ్చాడు. సామాజిక సేవే ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపాడు. అయితే 2024 ఎన్నికల్లో ఏపీలోని కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై పోటీకి దిగుతానని జరుగుతున్న ప్రచారంలో మాత్రం నిజం లేదని తెలిపాడు. అదంతా వట్టి పుకారేనని స్పష్టం చేశాడు. కుప్పం, ఆ చుట్టుపక్కల ప్రాంతంతో తనకు అనుబంధం ఉన్న మాట వాస్తమేనని విశాల్ చెప్పాడు. అక్కడ వాళ్ల నాన్న గ్రానైట్ వ్యాపారం చేసేవారని.. మూడేళ్లు కుప్పంలోనే ఉన్నానని తెలిపాడు. రాజకీయ ఎంట్రీపై స్పందించిన అనంతరం తన పెళ్లిపై అడిగిన ప్రశ్నలకు కూడా విశాల్ సమాధానమిచ్చాడు.

విశాల్ పెళ్లి కొద్దిరోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌కు చెందిన అనూష అనే అమ్మాయితే ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్‌లో ఉన్నాడనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొద్దిరోజులకు వీళ్లకు బ్రేకప్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తమిళ నటి అభినయతో డేటింగ్‌లో ఉన్నాడని.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం మొదలైంది. కానీ అది నిజం కాదని మొన్నటికి మొన్న ఓ ఈవెంట్‌లో విశాల్ క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి చేసుకున్న రోజే నేను పెళ్లి చేసుకుంటానని అదే ఈవెంట్‌లో విశాల్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం రెండు మూడు రోజులుగా వైరల్‌గా మారింది.ఈ క్రమంలోనే లాఠీ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్‌కు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన విశాల్.. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని సమాధానమిచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

AP CM Jagan mohan reddy | 32 మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్‌ వార్నింగ్‌.. పద్దతి మార్చుకోకుంటే టికెట్‌ ఇచ్చేదే లేదు

KA Paul | 30 నిమిషాల టైమ్ ఇస్తే ఏపీ అప్పులన్నీ తీర్చేస్తా.. కేఏ పాల్ బంపర్ ఆఫర్

Pawan Kalyan | వారాహిని ఆపండి.. నేనేంటో చూపిస్తా.. వైసీపీ నేతలకు జనసేనాని సవాల్

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News