Saturday, April 20, 2024
- Advertisment -
HomeEntertainmentHanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం...

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Hanu Raghavapudi | దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన సీతారామం సినిమా తాజాగా సంచలనం సృష్టించింది. ఓటీటీకే పరిమితమవుతున్న ఈరోజుల్లో.. ఆడియన్స్‌ను థియేటర్ల వరకు రప్పించింది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను సృష్టించింది. తాజాగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యి.. మంచి టీఆర్పీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ హను రాఘవపూడి.. సీతారామం కథ ఎలా పుట్టింది? ఈ సినిమాకు హీరోహీరోయిన్లుగా పక్క భాషల వల్లనే ఎందుకు ఎన్నుకున్నారు? తెలుగులో నటులు లేరా? వంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

కోఠిలో కొన్న సెకండ్ హ్యాండ్ బుక్‌లో దొరికిన లెటర్

తనకు పుస్తకాలు కొనడం అలవాటు అని.. అలా కోఠిలో కొన్న ఓ సెకండ్ హ్యాండ్ పుస్తకంలో ఒక లెటర్ దొరికిందని చెప్పాడు. హాస్టల్‌లో ఉంటున్న ఓ అబ్బాయికి.. అది వాళ్ల అమ్మ రాసిన లెటర్ అని పేర్కొన్నాడు. అప్పటివరకు ఆ లెటర్ ఓపెన్ చేయలేదని.. ఉత్సుకతతో తాను చదివానని చెప్పాడు. అందులో పెద్ద విషయమేమీ లేదని.. సెలవులకు ఇంటికి రమ్మని మాత్రమే రాసి ఉందని తెలిపాడు. అప్పుడు ఆ లెటర్‌లో ఏదైనా ముఖ్యమైన విషయం ఉండి ఉంటే ఏమై ఉండేదని ఆలోచన వచ్చిందని.. దాన్నుంచే సీతారామం కథ పుట్టిందని అసలు విషయం చెప్పాడు. కథ రాసుకున్న తర్వాత స్వప్ప కు చెబితే..దుల్కర్ సల్మాన్ కచ్చితంగా సరిపోతాడని ఆమె తెలిపిందని పేర్కొన్నాడు. అందుకే హీరోగా దుల్కర్ సల్మాన్‌ను ఎంపిక చేశామని తెలిపాడు.

అందుకే తెలుగు హీరోయిన్‌ను తీసుకోలేదు

సీత పాత్రకు ఎవరైనా కొత్తగా ఉండాలని అనుకుంటుంటే.. మృణాల్ ఠాకూర్‌ గురించి స్వప్న చెప్పిందని తెలిపారు. ఆమెను చూడగానే సీత పాత్రకు సరిపోతుందని అనిపించిందని అన్నాడు. ఇక ఈ పాత్రకు తెలుగు అమ్మాయిని తీసుకోకపోవడానికి కారణం కూడా హను వివరించాడు. ఆ పాత్రకు సరిపోయే తెలుగు ప్రొఫైల్ ఎక్కడా కనిపించలేదని తెలిపాడు. ఫలానా అమ్మాయి ఉందంటే.. ఆమె తమ పాత్రకు సరిపోతుందో లేదో చూడొచ్చని పేర్కొన్నాడు. కానీ అలా తెలుగు ప్రొఫైల్స్ ఎక్కడా కనబడలేదని చెప్పాడు. తెలుగు వాళ్లు దొరికితే మాకే ఎంతో మేలని.. వాళ్లకు భాష వచ్చి ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss Telugu season 6 | బిగ్‌బాస్ సీజన్ 6 విజేత రేవంత్.. టైటిల్ విజేతకంటే రన్నరప్‌కే ప్రైజ్‌మనీ ఎక్కువ.. ఎందుకో తెలుసా?

Namrata shirodkar | వాళ్ల వల్లే మహేశ్‌తో గొడవలు.. సితార అన్‌ప్లాన్‌డ్‌ బేబీ.. ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటపెట్టిన నమ్రత

Ramya | అప్పుడు సమంత.. ఇప్పుడు దీపిక.. కావాలనే ట్రోల్స్‌ చేస్తున్నారు.. మండిపడ్డ హీరోయిన్‌

Sreeleela | హైదరాబాద్‌లో సినిమా టికెట్లు అమ్మిన పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News