Wednesday, November 29, 2023
- Advertisment -
HomeEntertainmentBigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున...

Bigg Boss season 7 | బిగ్‌బాస్ 7 ను బాలయ్య హోస్ట్ చేస్తాడా? నాగార్జున మనసులో ఉన్న హీరో ఎవరు?

Bigg Boss season 7 | బిగ్‌బాస్ సీజన్ 6 అయిపోయింది. ఇలా సీజన్ ముగిసిందో లేదో తదుపరి సీజన్ ఎలా అనే దానిపై చర్చలు మొదలైపోయాయి. వచ్చే సీజన్‌కు సంబంధించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. నాగార్జున ఈ షో చేయడానికి ఇష్టపడట్లేదు. అవును ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. బిగ్ బాస్ సీజన్ 6 విషయంలో ఆయనకు చాలా విషయాలు నచ్చలేదని.. ఇదే విషయం మేనేజ్‌మెంట్‌కు చెప్పాడని సమాచారం. నెక్స్ట్ సీజన్ నుంచి హోస్ట్ చేయనని నాగ్ కరాఖండిగా చెప్పేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ ఎవరు హోస్ట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2017లో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ రియాలిటీ షోతో ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేశాడు. తనదైన యాంకరింగ్, కామెడీతో బిగ్‌బాస్ షోలో ఎంటర్‌టైన్ చేశాడు. ఈ దెబ్బతో అదిరిపోయే టీఆర్పీ వచ్చేసింది. కానీ రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేశాడు. అప్పటికే ఎన్టీఆర్ తన మార్క్ చూపించడంతో నాని యాంకరింగ్ పేలవంగా అనిపించింది. దీంతో బిగ్‌బాస్ షోకి షాకింగ్ టీఆర్పీ వచ్చింది. దీంతో మూడో సీజన్‌కు నాగార్జునను దించింది బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్. నాగ్ చేతిలోకి వచ్చాక బిగ్‌బాస్ రియాలిటీ షో టీఆర్పీల పరంగా దూసుకెళ్లింది. దీంతో వరుసగా ఆరో సీజన్ వరకు నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించాడు. బిగ్‌బాస్ షో అంటే నాగార్జునే అన్నంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు.

కానీ ఆరో సీజన్‌తో నాగ్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సాగిన అన్ని బిగ్‌బాస్ సీజన్లలో దీనికే అత్యంత దారుణమైన టీఆర్పీ వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే డిజాస్టర్ అనే టాక్ మూటగట్టుకుంది. పైగా ఈ షోలో ఎలిమినేషన్ ప్రక్రియపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అసలు జనాలకు పరిచయం లేని ఆదిరెడ్డి టాప్ 4 వరకు రావడం షాకింగ్‌గా అనిపించింది. పైగా జనాల సపోర్ట్ ఉన్నా కూడా మరికొందరినీ కావాలనే ఎలిమినేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గీతూ, సూర్య, ఇనాయాల ఎలిమినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ బాగానే వచ్చాయి.ఇనాయాను కావాలనే ఎలిమినేట్ చేయడం నాగ్‌కు కూడా నచ్చలేదట. అందుకే తదుపరి సీజన్ నుంచి హోస్ట్ చేయనని నాగార్జున చెప్పినట్టు సమాచారం.

బిగ్‌బాస్ నుంచి నాగార్జున తప్పుకుంటున్నట్టు వార్తలు రావడంతో తదుపరి సీజన్ నుంచి ఆ షోను ఎవరు హోస్ట్ చేస్తారనే దానిపై చర్చలు మొదలయ్యాయి. విజయ దేవరకొండ హోస్ట్ చేయబోతున్నాడని మొదట్లో వార్తలు వచ్చాయి. అవి కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌నే మళ్లీ వస్తాడనే ప్రచారం జరిగింది. కాకపోతే వీళ్లిద్దరూ కాదని.. ఈ షోను దగ్గుబాటా రానా హోస్ట్ చేస్తాడని తాజాగా వార్తలు వస్తున్నాయి. నంబర్ వన్ యారి ప్రోగ్రామ్‌లో యాంకరింగ్‌తో రానా మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో రానా పేరును నాగార్జున రికమెండ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే మేనేజ్‌మెంట్ మాత్రం బాలకృష్ణ వైపు మొగ్గుచూపుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో బాలయ్య బాబు అయితేనే బిగ్‌బాస్‌కు పర్‌ఫెక్ట్ అని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. మరి వీరిలో ఎవరు బిగ్‌బాస్ సీజన్ 7ను హోస్ట్ చేస్తారో చూడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bigg Boss Telugu season 6 | బిగ్‌బాస్ సీజన్ 6 విజేత రేవంత్.. టైటిల్ విజేతకంటే రన్నరప్‌కే ప్రైజ్‌మనీ ఎక్కువ.. ఎందుకో తెలుసా?

Hanu Raghavapudi | సీతారామం సినిమాలో తెలుగు హీరోయిన్‌ను తీసుకోకపోవడానికి కారణం అదే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్

Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News