Thursday, March 28, 2024
- Advertisment -
HomeEntertainmentWaltair Veerayya OTT Release Date | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya OTT Release Date | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..

Waltair Veerayya OTT Release Date | వాల్తేరు వీరయ్య సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి స్టైల్ మాస్ కామెడీని చాలారోజులుగా ప్రేక్షకులు మిస్సవుతున్నారు. రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150లో కామెడీ పండించాడు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్‌ఫాదర్ సినిమాల్లో సీరియస్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. దీంతో చిరు స్టైల్ కామెడీ, యాక్షన్‌ను మిస్సవుతున్న ఫీలింగ్‌కు ఫ్యాన్స్ వచ్చేశారు. ఇలాంటి టైమ్‌లో వింటేజ్ లుక్‌తో చిరంజీవి పూనకాలు తెప్పిస్తున్నాడు. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్‌ ఆకలి తీరుస్తున్నాడు. శుక్రవారం విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 8 వీక్స్ విండోను బేస్ చేసుకుని మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు విక్రయించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుంది. అంటే మార్చి 13 తర్వాతే వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈలోపు చిరంజీవి వింటేజ్ కామెడీని ఎంజాయ్ చేయాలంటే థియేటర్స్‌కి వెళ్లాల్సిందే.

వాల్తేరు వీరయ్య సినిమాలో పాత చిరును చూస్తున్నామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. స్టోరీపై పట్టువిడిచినప్పటికీ.. చిరంజీవి నుంచి ఏదైతే కోరుకుంటారో దాన్ని డైరెక్టర్ బాబీ చక్కగా ఎలివేట్ చేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్‌కు థియేటర్‌లో విజిల్స్ పడుతున్నాయి. శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా అందంగా కనిపించింది. మెగాస్టార్‌తో కలిసి అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బీజీఎం అదిరిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News