Thursday, June 13, 2024
- Advertisment -
HomeEntertainmentAishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Aishwarya lekshmi | సౌత్‌లో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది సముద్ర కుమారి. అదేనండీ ఐశ్వర్య లక్ష్మీ. పొన్నియన్ సెల్వన్ చిత్రంలో సముద్ర కుమారిగా ఐశ్వర్య లక్ష్మీ కనిపించేది కొద్దిసేపే అయినా తన మార్క్‌ను చూపించింది. ఇప్పుడు రెండో పార్ట్‌లో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతుంది. ఇది కాకుండా మట్టి కుస్తీ సినిమాలోనూ కుస్తీ యోధురాలిగా, గృహిణిగా వైవిధ్యమైన పాత్రలో మెప్పించింది. అమ్ము వెబ్ సిరీస్‌లోనూ కథా ప్రాధాన్యం ఉన్న లీడ్‌ రోల్‌లో నటించింది. ఇలా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఐశ్వర్య లక్ష్మీ చేసిన పోస్టు ఇప్పుడు ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఐశ్వర్య ప్రేమలో ఉందనే వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

నటుడు అర్జున్ దాస్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోను ఐశ్వర్య లక్ష్మీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దానికి రెడ్ కలర్ హార్ట్ సింబల్ జోడించి వదిలేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే సందేహం అందరిలో మొదలైంది. అవును ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు కాబట్టే అంత చనువుగా ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఇది ప్రమోషన్ స్టంట్ అయ్యి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీళ్లిద్దరూ తొందరలో ఏదైనా సినిమా చేస్తున్నారేమో.. జనాల అటెన్షన్ క్రియేట్ చేసేందుకు ఐశ్వర్య లక్ష్మీ ఇలా పోస్టు పెట్టి ఉంటుందని వాదిస్తున్నారు. ఈ వాదన వెనుక కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవల మట్టి కుస్తీ ప్రమోషన్‌లో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మీకి ప్రేమ పెళ్లి చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్న ఎదురైంది. దానికి అసలు పెళ్లి మీదే ఇంట్రెస్ట్ లేదని సమాధానమిచ్చింది. రెండు మూడు నెలల కిందనే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పిన ఐశ్వర్య లక్ష్మీ.. ఇప్పుడు అర్జున్ దాస్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోనూ చూసిన కాని నమ్మలేకపోతున్నారు. మరి వీళ్లిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉందా? లేదా సినిమా స్టంటా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే.

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో చిన్న పాత్రలో అర్జున్ దాస్ కనిపించాడు. ఆ తర్వాత మాస్టర్ సినిమాలోనూ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్‌తో ఇతనికి హీరోగా కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పలు ఆఫర్లు అందుకున్న అర్జున్ దాస్.. బుట్టబొమ్మ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News