Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentUpasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Upasana Konidela | చాలా ఏళ్లకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట గుడ్ న్యూస్ చెప్పింది. పెళ్లయిన దాదాపు పదేళ్లకు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందంగా పంచుకున్నారు. మెగాస్టార్ చేసిన ట్వీట్‌నే ఉపాసన రీట్వీట్ చేసింది కానీ తను డైరెక్ట్‌గా ఈ శుభవార్తను చెప్పలేదు. కానీ తాజాగా ఫస్ట్ టైమ్ ఉపాసన పుట్టబోయే బిడ్డ గురించి ట్వీట్ చేసింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకకు హాజరయ్యేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌కు వెళ్లింది. ఈ వేడుకకు రామ్‌చరణ్‌తో కలిసి ఉపాసన కూడా అక్కడకు వెళ్లింది. ఆ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం. కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఈ అవార్డు వచ్చింది. ఇలా ఓ తెలుగు సినిమాకు ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి మెమొరెబుల్ మూమెంట్‌లో తను కూడా భాగమైనందుకు ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని.. దేశం గర్వించదగ్గ విజయమని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ప్రయాణంలో భాగమయ్యేలా చేసిన రామ్‌చరణ్, రాజమౌళికి ధన్యవాదాలు తెలిపింది. తనతో కలిసి తన బేబీ కూడా ఈ అనుభూతి పొందుతుండటం ఎంతో ఆనందంగా ఉందని ఎమోషనల్ అయ్యింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన మెగా అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

natu natu song | గల్లీ బాయ్ పేరు.. అంతర్జాతీయ వేదిక పై.. గర్వంగా ఉందంటూ ఎమోషన్‌ అయిన రాహుల్‌ సిప్లిగంజ్‌

Natu Natu | ఉక్రెయిన్ అధ్యక్షుడి ఇంటి ముందే నాటు నాటు సాంగ్ చిత్రీకరణ.. పర్మిషన్ ఇవ్వడానికి కారణమిదే!

Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్‌లో అనుపమ ఫిక్స్.. అల్టర్‌నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News