Tuesday, March 19, 2024
- Advertisment -
HomeEntertainmentWaltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Waltair Veerayya Review | మెగాస్టార్ చిరంజీవి నుంచి మాస్ కామెడీ ఎంటర్‌టైనర్‌ వచ్చి చాలారోజులు అయ్యింది. రీఎంట్రీ తర్వాత ఖైదీ నంబర్ 150లో అలాంటి క్యారెక్టర్‌ చేసిన చిరు.. ఆ తర్వాత సీరియస్ స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. దీంతో వింటేజ్ చిరంజీవిని మెగా ఫ్యాన్స్‌ను మిస్సవుతున్నారు. దాన్ని తీర్చడానికి వాల్తేరు వీరయ్య చిత్రంతో వచ్చాడు మెగాస్టార్. ఇప్పటికే రిలీజైన లుక్స్, ట్రైలర్ బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. పైగా మాస్ మహారాజా రవితేజ స్పెషల్ రోల్‌లో నటించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి వింటేజ్ లుక్‌లో చిరంజీవి మెప్పించాడా? ఈ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరిందా? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం..

కథ

అంతర్జాతీయ డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్ ( బాబీ సింహా ) పోలీసుల నుంచి తప్పించుకుని వెళ్తాడు. దీంతో పోలీస్ అధికారి సీతాపతి ( రాజేంద్ర ప్రసాద్ ) సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ సీజర్‌ను పట్టుకొచ్చి తన ఉద్యోగాన్ని నిలుపుకోవాలని అనుకున్న సీతాపతి.. వాల్తేరు వీరయ్య ( చిరంజీవి ) సాయం కోరుతాడు. ఓ కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీరయ్య కూడా దీనికి సిద్ధమవుతారు. ఇందుకోసం సీతాపతితో 25 లక్షలకు ఒప్పందం చేసుకుంటాడు. అలా మలేసియా వెళ్లిన వీరయ్య సాల్మన్ సీజర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తనకు సన్నిహితుడైన కాలా ( ప్రకాశ్ రాజ్ ) అంతర్జాతీయ డ్రగ్ డీలర్ ఎలా అయ్యాడు. వాళ్ల మధ్య సంబంధమేంటి? విక్రమ్ సాగర్ (రవితేజ)తో ఉన్న గతమేంటి? అతిథి ( శ్రుతి హాసన్) ఎవరు? ఆమె మలేసియాలో ఎందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పట్టుకోవడంతో సినిమా మొదలవుతుంది. తర్వాత అతను తప్పించుకోవడం.. పోలీసు అధికారిని సస్పెండ్ చేయడం ఇలా అన్నీ సీన్లు చకచకా అయిపోతాయి. మలేసియా వెళ్లి డ్రగ్ మాఫియాను పట్టుకోవడానికి సమర్థులెవరు అని వెతుకుతుండగా వాల్తేరు వీరయ్యగా చిరంజీవి మాస్ ఎంట్రీ ఉంటుంది. ఇది ఫ్యాన్స్‌కు తెగ నచ్చేస్తుంది. ఆ తర్వాత కథ మలేసియాకు టర్న్ తీసుకుంటుంది. అక్కడ వెన్నెల కిశోర్‌తో చేసే కామెడీ పాత చిరంజీవిని గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్ మొత్తం చిరంజీవి మార్క్ కామెడీతోనే నడుస్తోంది. శ్రుతి హాసన్‌తో చిరంజీవి సీన్స్ రొమాంటిక్‌గా అనిపిస్తాయి. కథ, కథనం పెద్దగా లేకపోవడంతో సీన్స్ అన్నీ రొటీన్‌గా కనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందే సినిమా అసలు కథలోకి వెళ్తుంది. అప్పుడు వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి.

ఇంటర్వెల్ తర్వాత ఏసీపీ విక్రమ్ సాగర్‌గా రవితేజ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇస్తాడు. అతని పాత్ర నిడివి తక్కువే అయినా స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. రవితేజ, చిరంజీవి మధ్య సీన్స్ అంటే ఫ్యాన్స్ భారీగా ఊహించుకుంటారు. కానీ వీళ్ల మధ్య వచ్చే సీన్స్ అంతగా ఎలివేట్ అవ్వలేదు. ఎమోషన్ పండించే అవకాశం ఉన్నా దాన్ని ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ బాబీ తడబడ్డాడు. చిరంజీవి, రవితేజ మధ్య కొన్ని సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఒకరి సినిమా డైలాగులను మరొకరు చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. సల్మాన్ సీజర్‌ను చంపే ఎపిసోడ్ సినిమాకు హైలైట్. కోర్టు సీన్‌లో కూడా మెగాస్టార్ కేకపుట్టించాడు.

మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించాడు. చిరంజీవి నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో దానికి తగ్గట్టుగా మెగాస్టార్‌ను చూపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కథ, కథనంపై పెద్దగా దృష్టి పెట్టనట్టు అనిపిస్తుంది. చాలా చోట్ల తడబడ్డాడు. స్క్రీన్‌ప్లే కూడా అంతగా నచ్చదు. ఇంటర్వెల్ ముందు, సెకాండాఫ్‌లో కాసేపు మాత్రమే సినిమాలో జోష్ ఉంటుంది. మిగిలినదంతా రొటీన్‌గా అనిపిస్తుంది. ఫైట్స్ బాగున్నాయి. చిరంజీవి సినిమా అంటే దేవీశ్రీప్రసాద్ ట్రీట్‌మెంట్ వేరే లెవల్‌లో ఉంటుందని అందరికీ తెలిసిందే. వాల్తేరు వీరయ్యలోనూ అది మనకు కనిపిస్తుంది. సాంగ్స్ ఆకట్టుకుంటాయి. బాస్ పార్టీ, పూనకాలు లోడింగ్, నువ్వు శ్రీదేవి.. నేను చిరంజీవి సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ రూపొందించిన సెట్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఎవరు ఎలా చేశారంటే..

సినిమాను మొత్తాన్ని చిరంజీవి తన భుజాలపై మోశాడు. చాలా రోజుల తర్వాత వింటేజ్ అవతార్‌లో కనిపించాడు. కామెడీ కూడా పాత రోజుల్ని గుర్తు చేస్తుంది. ఫైట్స్, డ్యాన్సులతో రెచ్చిపోయాడు. రవితేజ క్యారెక్టర్ ఉండేది కొద్దిసేపే అయినా వినోదాన్ని పంచాడు. రవితేజ స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. శ్రుతి హాసన్ పరిధి తక్కువే అయినా అందంగా కనిపించింది. పాటల్లో చిరంజీవితో కలిసి అద్భుతంగా స్టెప్స్ వేసింది. క్రాక్ సినిమా తర్వాత మరోసారి ఇందులో ఫైట్స్ సీన్స్ చేసింది. కేథరిన్ థ్రెసా కొన్ని సీన్స్‌కే పరిమితమైంది. ప్రకాశ్ రాజ్, బాబీ సింహా తమ పాత్రలకు న్యాయం చేశారు. వాళ్ల క్యారెక్టర్స్‌ను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. వెన్నెల కిశోర్ కామెడీ నచ్చుతుంది. రాజేంద్ర ప్రసాద్ పరిధి మేరకు నటించాడు.

ప్లస్ పాయింట్స్

చిరంజీవి వింటేజ్ లుక్, కామెడీ
రవితేజ
ఇంటర్వెల్ సీన్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే

చివరగా.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?

Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?

Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్

Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News