Friday, March 29, 2024
- Advertisment -
HomeNewsAPPerni Nani | మోదీతో ఎనిమిదేళ్లు.. చంద్రబాబుతో ఐదేళ్లు ఉండి ఏం పీకావ్.. జనసేన అధినేతపై...

Perni Nani | మోదీతో ఎనిమిదేళ్లు.. చంద్రబాబుతో ఐదేళ్లు ఉండి ఏం పీకావ్.. జనసేన అధినేతపై పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు

Perni Nani | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరితెగింపు రాజకీయం చేస్తున్నారని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సభకు వచ్చిన జనాన్ని కూడా నమ్మనన్న పవన్ కళ్యాణ్ ( pawan kalyan ) మాటలు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. సభకు వచ్చిన జనాలను కూడా నమ్మనని చెప్పడమే దౌర్భాగ్యమని అన్నారు. తనను అభిమానించే వారిని కూడా పవన్ కళ్యాణ్ కించపరిచాడంటూ తీవ్ర స్థాయిలో నాని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మూడు ముక్కల సీఎం అనడాన్ని నాని తప్పుపట్టారు. అసలు పవన్ కళ్యాణే మూడు ముక్కల నాయకుడని విమర్శించారు. ఆయనో రాజకీయ వ్యభిచారి అంటూ ధ్వజమెత్తారు. ఓవైపు బీజేపీ ( BJP ) తో మరోవైపు టీడీపీ ( TDP ) తో రాజకీయం చేశారని మండిపడ్డారు.

రణస్థలం జనసేన ( Janasena ) యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, పరనింద, సినిమా డైలాగ్స్‌కే సరిపోయిందని విమర్శించారు. తనను జనసేన కార్యకర్తలు, ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకమే పవన్‌కు లేదని, అందుకే చంద్రబాబుతో పొత్తు పొట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు సభలో చెప్పారని పేర్ని నాని అన్నారు. ఈ విషయం చెప్పేందుకే సభ పెట్టినట్లుందన్నారు. సభకు వచ్చిన వాళ్లందరూ ఓట్లేస్తారన్న నమ్మకం పవన్‌కే లేదని ఆరోపించారు. అందుకే నినాదాలు చేయడం కాదు.. తనకు ఓటు వేసేదాక జనసేన కార్యకర్తల్లో ఆ కసి ఉండాలంటూ మాట్లాడారని విమర్శించారు. సభలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే పవన్‌కు టైం సరిపోయిందని విమర్శించారు. ఒకవిధంగా పవన్ కళ్యాణ్ ముసుగు ఈ సభతో తొలగిపోయిందన్నారు. టీడీపీతో పొత్తుకోసమే పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నట్లు ఈ సభతో తేలిపోయిందన్నారు.

సినిమా హీరోయిన్లపై మీకున్న అభిప్రాయం ఇదేనా ?

రోజాను ఉద్దేశించి డైమండ్ రాణి అంటూ వ్యాఖ్యానించడంపై పేర్నినాని అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించినంత మాత్రాన అలా అనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మీ ఇంట్లోనూ సినిమాల్లో నటించిన మహిళలు ఉన్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాలన్నారు. సినిమా హీరోయిన్లపై మీకున్న అభిప్రాయం ఇదేనా అని ప్రశ్నించారు. రోజా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఇప్పుడు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్‌కు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, రోజాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

అభిమానులపై పవన్‌కు నమ్మకమందా ?

ఉత్తరాంధ్ర యువశక్తి సభలో యువతకు స్ఫూర్తి నింపుతానని పవన్ నెల రోజుల నుంచి చెబుతూ వచ్చారని, కానీ ఆయన ప్రసంగమంతా ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా ఉందని పేర్ని నాని విమర్శించారు. కేవలం మహనీయులు విమర్శిస్తేనే తట్టుకుంటాడట కానీ మనలాంటి వాళ్లు విమర్శిస్తే తట్టుకోలేనన్న పవన్ మాటలు చూస్తుంటే ఆయనేమిటో ఆయన విధానాలేంటో మీరే అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. సభలో మూడు నాలుగు వేల మంది ఉన్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. పవన్‌కు సినిమా భాష మాత్రమే తెలుసని, ఆయనో కుసంస్కారి, దిగజారిన వ్యక్తి అని అన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను కుసంస్కారంతో మాట్లాడటం తప్పా సభలో ఇంకేమైనా ఉందా అని నాని ప్రశ్నించారు. నమ్మి సభకు వెళ్లిన వాళ్లను కూడా నేను మిమ్మల్ని నమ్మను అంటే ఎట్లా అని ప్రశ్నించారు. తనను సభకు వచ్చిన వాళ్లే నట్టేట ముంచేస్తారని పవన్ మాట్లాడటం ఆయనకు అభిమానులపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని నాని అన్నారు.

మా వాడు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది

మేమేం పీకామో.. పీకలేదో ప్రజలు చూస్తారని పవన్‌ను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ” ప్రధాని నరేంద్ర మోదీతో ఎనిమిదేళ్లు, మాజీ సీఎం చంద్రబాబుతో ఐదేళ్లు ఉన్నావ్.. రాష్ట్రానికి ఏం పీకావ్ ” అని పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడటం మానకపోతే ఊరుకునేది లేదని నాని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌తోనే కాపులకు ఇబ్బంది అని అన్నారు. పవన్ మావాడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుందంటూ నాని వ్యాఖ్యానించారు. ” నా దగ్గరా రెండు చెప్పులున్నాయి. పవన్ నోటి జాడింపు మానుకోకపోతే.. పవన్ కళ్యాణ్ బిల్డప్ బాబాయ్. ఏ రోటికాడ ఆ పాట పాడేరకం. పవన్ వల్లే కాపులకు ఇబ్బంది.. జగన్ వల్ల కాదు. పవన్‌ మా వాడని చెప్పుకోవడానికే సిగ్గేస్తుంది” అని పేర్ని నాని విమర్శించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Roja Selvamani | ఆ ఒక్క మాటతో శ్రీకాకుళం జనం జేబులో చేతులు పెట్టుకుని వెళ్లిపోయారు.. పవన్ కళ్యాణ్‌పై రోజా సెటైర్లు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునైతే నువ్ కల్యాణాల కళ్యాణ్.. పవన్ కళ్యాణ్‌పై అంబటి స్ట్రాంగ్ కౌంటర్

Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News