Home Entertainment Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Manchu Manoj | భూమా మౌనికతో త్వరలోనే పెళ్లి? మంచు మనోజ్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?

Manchu Manoj | మంచు మనోజ్ రెండో పెళ్లి విషయం టాలీవుడ్‌లో కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారింది. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె భూమా మౌనికతో మంచు మనోజ్ రిలేషన్‌లో ఉన్నాడని.. త్వరలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి బయటకు వెళ్తూ మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తాజాగా భూమా మౌనిక రెడ్డితో కలిసి కడప జిల్లాకు వెళ్లిన మంచు మనోజ్.. అమీన్‌ పీర్ దర్గాను దర్శించుకున్నాడు. అనంతరం మీడియాతో మంచు మనోజ్ మాట్లాడాడు. సినిమాల్లో గ్యాప్ రావడంపై, కొత్త జీవితం మొదలుపెట్టడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే కొత్త సినిమాలు ప్రారంభించబోతున్నట్టు చెప్పిన మనోజ్.. కొత్త జీవితాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే ఫ్యామిలీని తీసుకుని దర్గాకు వస్తానని ఎమోషనల్ అయ్యాడు. సినిమాలు తీయడంలో గ్యాప్ వచ్చిందని.. ఇప్పట్నుంచి రెగ్యులర్‌గా సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. అయితే సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు.

అయితే మంచు మనోజ్ మీడియాతో చెప్పిన మాటలు విన్న ఫ్యాన్స్.. తమ హీరో తొందరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిక్సవుతున్నారు. ప్రణతితో విడాకుల తర్వాత మంచు మనోజ్ ఒంటరిగానే ఉంటున్నాడు. మంచు ఫ్యామిలీకి కూడా దూరంగానే ఉంటున్నాడు. సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చాడు. దీంతో మంచు మనోజ్‌కు ఏమైందా అని అందరూ చర్చలో పడిపోయారు. అలాంటి టైమ్‌లోనే భూమా మౌనికతో కలిసి మంచు మనోజ్ మీడియా కంటికి చిక్కాడు. అప్పట్నుంచి వీరిద్దరి పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కడపకు కూడా వీరిద్దరూ కలిసి రావడం.. ఇదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నానని మంచు మనోజ్ చెప్పడం చూసి.. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంతా అనుకుంటున్నారు.

సినిమాలు తీయడంలో గ్యాప్ వచ్చిందని చెప్పిన మనోజ్.. ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందో మాత్రం చెప్పడానికి నిరాకరించాడు. కాకపోతే ఇప్పట్నుంచి వరు సినిమాలు చేస్తానని హామీ ిచ్చాడు. అయితే కొత్త జీవితం ప్రారంభిస్తానని చెప్పిన మంచు మనోజ్ మాటలు విన్న అభిమానులు మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఫిక్సయ్యారు. ప్రణతితో విడిపోయిన తర్వాత మంచు మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ సోదరి మౌనికతో తరచూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కడపకు కూడా ఇద్దరూ కలిసి రావడం.. అనంతరం దర్గాకు వచ్చిన మనోజ్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అని చెప్పడం చూసి మౌనికను త్వరలోనే మనోజ్ చేసుకుంటాడని అంతా ఫిక్సయిపోయారు.

Follow Us : FacebookTwitter

Read More:

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Exit mobile version