Home Entertainment kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో...

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

kannada actress Abhinaya | కట్నం కోసం వదినను వేధించిన కేసులో సీనియర్ నటి అభినయకు ఉన్నత న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది. అభినయ సోదరుడు శ్రీనివాస్‌కు మూడేళ్లు, ఆమె తల్లికి ఐదేళ్లు, మరో సోదరుడు చెలువరాజుకు రెండేళ్ల శిక్షను విధించింది.

కన్నడ సీనియర్ నటి అభినయ సోదరుడు శ్రీనివాస్ భార్యను వేధించిన కేసులో వీరికి శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. శ్రీనివాస్, లక్ష్మీదేవికి 1998లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలకు అదనంగా లక్ష రూపాయలు తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధించారు.

దీనిపై 2002లో లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను బెంగళూరు నగర జిల్లా న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో భాగంగా నేరం రుజువైనట్లు పేర్కొన్న హైకోర్టు.. శిక్ష విధించింది. తీర్పుపై లక్ష్మీదేవి హర్షం వ్యక్తం చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

Parineeti Chopra | ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి ప్లీజ్‌.. సౌత్‌ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం బతిమిలాడుతున్న బాలీవుడ్‌ బ్యూటీ

Sushant singh rajput | సుశాంత్‌ మరణించిన ఫ్లాట్‌ అంటేనే భయపడిపోతున్నారట.. అందుకే రెండున్నరేళ్లయినా ఖాళీగానే ఉంది

Exit mobile version