Home Entertainment Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

Manchu Lakshmi | కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది మంచు లక్ష్మీ. టాక్ షోలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటిగా, నిర్మాతగా తనలోని కోణాలను బయటపెట్టింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మీ.. ట్రోల్స్‌కు కూడా ఎక్కువగానే గురవుతుంటుంది.అప్పుడప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలను ఎగతాళి చేస్తూ ట్రోలింగ్స్ చేస్తూనే ఉంటారు. కానీ ఎంతమంది ఎగతాళి చేసినప్పటికీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. మొహమాటం లేకుండా తనకు ఏమనిపిస్తే అది చెబుతూ ఉంటుంది.

దీనికి తాజాగా జరిగిన ఒక ట్వీట్‌నే ఉదాహరణగా చెప్పొచ్చు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నానని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక ట్వీట్ చేశాడు. దానిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే పవన్ లుక్‌ను మంచి లక్ష్మీ లుక్‌తో పోలుస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మాన్‌స్టర్ సినిమాలో మంచు లక్ష్మీ మార్షల్ ఆర్ట్స్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఆ ఫొటోను పవన్ కళ్యాణ్ ఫొటో పక్కన బెట్టి ఇద్దరూ ఒకేలా ఉన్నారంటూ మీమ్ ఒకటి పెట్టాడు. సాధారణంగా ఎవరైనా దానిపై సీరియస్ అవుతారు. కానీ మంచు లక్ష్మీ మాత్రం భిన్నంగా స్పందించింది. మంచో చెడో పవన్ పక్కన నా ఫొటో పెట్టడం థ్రిల్‌గా ఫీలయ్యానని ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని పక్కనబెడితే తాజాగా మంచు లక్ష్మీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ఒకటి వైరల్‌గా మారింది.

నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేశా. వాటిని ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు మారిపోయాను. గతంలో చేసినటువంటి తప్పులను మళ్లీ చేయను అంటూ మంచు లక్ష్మీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఏం తప్పు చేసిందనేది మాత్రం బయటపెట్టలేదు. ఏదేమైనా ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Pavala Shyamala | నాకు జరిగిన అవమానం తెలిస్తే చిరంజీవి సహించరు.. ఎమోషన్‌ అయిన పావలా శ్యామల

Anupama Parameswaran | అనుపమ లాంటి కూతురు ఉంటే బాగుండు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Exit mobile version