Home Lifestyle Do you know Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Vasthu | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Vasthu | ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. ఎంత లగ్జరీగా ఇల్లు కట్టుకున్నా సరే.. హాల్, బెడ్రూం, కిచెన్ అన్నీ ఉండాల్సిన చోట ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే లేని పోని చికాకులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇంట్లో ఏ గది ఏ దిక్కులో ఉంటే మంచిదనే విషయాన్ని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. దీని ప్రకారం కిచెన్ ఆగ్నేయ మూలలో ఉండాలి. అప్పుడే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఏదో గుడ్డిగా చెప్పింది కాదు.. దీని వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉంది.

సాధారణంగా పొయ్యి వెలిగించినప్పుడు అగ్గిపుల్ల, ఆ మంట నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడుతుంది. తరచూ ఈ వాయువును పీల్చుకుంటే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ గాలి పీలిస్తే త్వరగా అలసిపోతారు. తల తిరగడం వంటి సమస్యలు వస్తుంటారు. అదే కిచెన్ ఆగ్నేయంలో ఉంటే తూర్పు, దక్షిణ దిశల నుంచి గాలి, వెలుతురు బాగా వస్తుంది. పొయ్యి నుంచి వెలువడే వాయువులు, వంట చేసినప్పుడు వచ్చే ఘాటు వాసనలు సులువుగా బయటకు వెళ్లిపోతాయి. అనారోగ్యం బారిన పడరు. అందుకే ఆగ్నేయం మూలలో కిచెన్ ఏర్పాటు చేయాలని చెబుతారు.

ఆగ్నేయంలో కుదరకపోతే వాయువ్యంలో దిక్కున కూడా కిచెన్ కట్టుకోవచ్చు. అయితే వాయువ్యంలో వంట గది ఉంటే తూర్పు అభిముఖంగా వంట చేసే వారి నీడ పొయ్యి మీద పడుతుంది. కాబట్టి తగినంత వెలుతురు ఉండేలా చూసుకుంటే ఇబ్బంది ఉండదు. వంట గదిని ఇరుకుగా కాకుండా.. ఒకరిద్దరు తిరిగేలా విశాలంగా కట్టుకోవాలి.

కిచెన్ ఉండే దిశనే కాదు.. ఆ రూంకి వేసే రంగులు కూడా మనపై ప్రభావం చూపిస్తాయి. వంట గది గోడలకు పూర్తి ముదురు రంగులు వేయకూడదు. ముదురు రంగులు.. వెలుతురును తగ్గిస్తాయి. మానసికంగా ఇరుగ్గా ఉన్న ఫీలింగ్ కలుగజేస్తాయి. అలాగని మరీ లేత రంగులు కూడా వేయకూడదు. లేత రంగులు త్వరగా మసకబారిపోతాయి. కాబట్టి మీడియంగా ఉండే రంగులనే వాడాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Exit mobile version