Home Entertainment Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై...

Pawan kalyan – Ali | గ్యాప్ రాలేదు.. క్రియేట్ చేశారు.. పవన్ కళ్యాణ్‌తో రిలేషన్‌పై అలీ ఓపెన్ కామెంట్స్

Pawan kalyan – Ali | టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన సినిమా వస్తుందంటే అందులో అలీ కంపల్సరీ ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. వీరిద్దరి కాంబినేషన్‌ను చూసేందుకు ఆడియన్స్ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొద్దిరోజులుగా వీరిద్దరికి పడటం లేదని ప్రచారం జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమా టైమ్‌లో మొదలైన మనస్పర్థలు రోజురోజుకీ తీవ్రమయ్యాయి.దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. పైగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపిస్తే.. అలీ వెళ్లి వైసీపీలో చేరాడు.దీనిపై అప్పట్లో పెద్ద చర్చనే జరిగింది. అలీ నిర్ణయంతో వీరిద్దరి మధ్య భారీగా తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకున్నారు. అందుకే మొన్నటికి మొన్న అలీ కూతురి పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ రాలేదని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటిపై తాజాగా అలీ స్పందించాడు. పవన్‌తో ఉన్న విబేధాలపై మనసువిప్పి మాట్లాడాడు.

అలీ హోస్ట్‌గా ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమవుతున్న అలీతో సరదాగా టాక్ షోకు ఎండింగ్ పడబోతున్నది. ఈ షోకు ఎప్పుడూ హోస్ట్‌గా వచ్చే అలీ ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా వచ్చాడు. యాంకర్ సుమ ఫైనల్ ఎపిసోడ్‌ను హోస్ట్ చేసింది. విజయవంతంగా 350 ఎపిసోడ్స్‌ను హోస్ట్ చేసిన అలీని అభినందిస్తూనే పలు ప్రశ్నలను సంధించింది సుమ. ఈ సందర్భంగానే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉన్న అలీ, పవన్ కళ్యాణ్ ఇష్యూను కూడా ప్రస్తావించింది. పవన్‌ కళ్యాణ్‌తో ఎందుకు గ్యాప్ వచ్చింది? రీజన్ ఏంటి? చెప్పాలని అలీని సుమ ప్రశ్నించింది. దానికి అలీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తమ ఇద్దరి మధ్య గ్యాప్ రాలేదని.. గ్యాప్ క్రియేట్ చేశారని.. మొదట్నుంచి ఏం జరిగిందో వివరించాడు. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో అంతవరకే చెప్పి కట్ చేశారు. పవన్‌తో విబేధాల గురించి ఆలీ ఏం చెప్పాడో తెలియాలంటే ఈ నెల 19 ఫైనల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ ఎపిసోడ్‌లో అలీ తన జీవితంలోని పలు విషయాలను సుమతో పంచుకున్నట్టు తెలుస్తోంది. తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఫస్ట్ రెమ్యునరేషన్ వంటి వివరాలను కూడా పేర్కొన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Top 10 south Indian actress | ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికింది ఈ హీరోయిన్‌ గురించే..

Shriya saran | ప్రెగ్నెన్సీ విషయం అందుకే దాచాల్సి వచ్చింది.. అసలు విషయం చెప్పిన శ్రియ

Manchu Lakshmi | సరిదిద్దుకోలేని తప్పులు చేశా.. మంచు లక్ష్మీ భావోద్వేగం

kannada actress Abhinaya | సీనియర్ నటికి రెండేళ్ల జైలు శిక్ష.. వరకట్న వేధింపుల కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పు

Exit mobile version