Home News International Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో...

Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్‌ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?

Viral News | కొంత కాలంగా విమానాల్లో ప్రయాణించే కొందరు ప్రయాణికులు విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం లేదంటే వారి పై దాడి చేయడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు విమానం గాల్లో ఉండగానే దాని తలుపు ను తెరవడానికి ప్రయత్నించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా ఇలాంటి ఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న మసాచు సెట్స్ కు చెందిన ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్ విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించాడు. అలా చేయడానికి వీలు లేదని చెప్పిన విమాన సిబ్బంది పై అతడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటన లాస్ ఏంజెల్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. మార్చి 5న యునైటెడ్ ఎయిర్ లైన్స్‌ కి చెందిన ఓ విమానం లాస్ ఏంజిల్స్ నుంచి బోస్టన్ కు ప్రయాణికులతో ప్రయాణమైంది. విమానం మరో 45 నిమిషాల్లో బోస్టన్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఆ సమయంలో ఒక ఎమర్జెన్సీ డోర్ అన్ లాక్ అయినట్లు కాక్ పిట్లో అలారమ్ మోగింది. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ద్వారాన్ని పరిశీలించారు.

డోర్ లాకింగ్ హ్యాండిల్ ను ఎవరో లాగినట్లు కనిపించింది. దీంతో వెంటనే సిబ్బంది హ్యాండిల్ ను సరిచేసి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ వద్ద కొంతసేపు ఉన్నాడని అతడే దాన్ని తీసి ఉంటాడని విమాన సిబ్బందిలో ఒకరు విమాన పైలట్ కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి ఆ ప్రయాణికుడిని అడగ్గా.. అతడు సిబ్బందితో గొడవ పడ్డాడు.

అంతేకాకుండా సిబ్బందిలో ఒకరి మెడపై తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగక పదునైన వస్తువుతో పొడవడానికి ప్రయత్నించాడు. దీన్ని తోటి ప్రయాణికులు గమనించి ఆ ప్రయాణికుడిని అడ్డుకున్నారు. విమానం బోస్టన్ లో దిగగానే విమాన సిబ్బంది ఎయిర్పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో వారు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఘటనపై యునైటెడ్ ఎయిర్లైన్స్ స్పందించింది. తమ సిబ్బంది అప్రమత్తతతో విమాన ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని వెల్లడించింది. తమ విమాన సిబ్బందిపై దాడి చేసిన ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్ ను భవిష్యత్తులో తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version