Home Lifestyle Do you know Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Holi Celebrations | హోలీ పండుగ అంటే చిన్నవారి నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే ఎంతో ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు. హోలీ సందర్భంగా రంగులు చల్లుకుంటూ ఆడుకోవడం సరదాగానే ఉంటుంది. అయితే ఈ సరదా సమయంలో కూడా కొన్ని అపాయాలు ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే హోలీని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవడం కుదురుతుంది.
అవేంటో ఇప్పుడు చూద్దాం..

హోలీ రోజున చాలామంది మహిళలు స్నేహితులు, బంధువులతో రంగులు జల్లుకోవడం మొదలుపెడతారు. అలాంటి సమయంలో చుట్టుపక్కల ఉండే పోకిరీలు అసభ్యంగా చూడటం గానీ, అనుచితంగా ప్రవర్తించడం కానీ చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి అటువంటి ఇబ్బంది తలెత్తకూడదంటే బాగా తెలిసిన వారితోనే హోలీ ఆడుకోండి.

హోలీ ఉత్సాహంలో స్నేహితులతో కలిసి తెలియని ప్రదేశానికి అస్సలు వెళ్లవద్దు. ఇది మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. అలాగే నమ్మకమైన సన్నిహితులతో మాత్రమే హోలీ ఆడండి. హోలీ ఆడేందుకు బాగా తెలిసిన ప్రదేశాలను ఎంచుకోండి. హోలీ రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులకు తెలియజేయండి.

హోలీ కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలో మాత్రమే పాల్గొనడం ఇంకా సురక్షితం. అయితే అలాంటి ఈవెంట్లలో పాల్గొనేముందు ఆ లొకేషన్‌ను కుటుంబసభ్యులతో షేర్‌ చేసుకోవాలి.

హోలీ ఆడేటప్పుడు ఫోన్‌ను నీటికి దూరంగా ఉంచుకోండి. అప్పుడే అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని సంప్రదించగలరు.

అమ్మాయిల జీవితాలతో ఆడుకునేందుకు చాలామంది పోకిరీలు హోలీని క్యాష్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆహారపదార్థాల్లో మత్తు మందు కలిపిచ్చి.. స్పృహ తప్పిన తర్వాత కిడ్నాప్‌ చేసి తమ కోరికను తీర్చుకున్న ఘటనలను గతంలో చాలానే చూశాం. కాబట్టి ఎవరైనా తెలియని వ్యక్తులు ఇచ్చే ఆహారపదార్థాలను తీసుకోకపోవడం మంచిది. అప్పుడే మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు.

హోలీ రోజున రంగులు పూసే సాకుతో ఆకతాయిలు అమ్మాయిలను తాకేందుకు ప్రయత్నిస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ల తప్పుడు స్పర్శను గ్రహించి వారికి దూరంగా జరగండి. అలాంటి వారితో పూర్తిగా జాగ్రత్తగా ఉండండి. నిర్మొహమాటంగా వారిని దూరం జరగమని చెప్పండి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version