Home Lifestyle Health H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ...

H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?

H3N2 Influenza Virus | వాతవరణంలో వస్తున్న మార్పుల వల్ల హెచ్‌ 3 ఎన్‌ 2 ఇన్‌ ఫ్లూఎంజా అనే వైరస్‌ ఈ సమయంలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని ఢిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఇది ఎక్కువగా గాలి తుంపర్ల వల్ల వ్యాప్తి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు, చిన్నపిల్లలు, పెద్దవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ కొవిడ్‌లాగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్‌ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని చెప్పారు. కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్నాయి.

లక్షణాలివే..

సాధారణంగా ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే.. ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు.

కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్‌తో ఇలాంటి సంక్షోభమే వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్. ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే.. వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది. దీంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే..ఇదేమంత ఆందోళనకరమైన విషయం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవుతుంటుందని చెప్పుకొచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version