Home News International Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Kim Jong un Sister | ఆ చర్యలను యుద్ధంగా భావిస్తాం: కిమ్‌ సోదరి!

Kim Jong un Sister | ఊరందరిది ఒకదారైతే.. ఊలిపి కట్టది ఒకదారన్నట్లు.. ప్రపంచ దేశాలన్ని ఒకటైతే ఉత్తర కొరియా రూటే సపరేటు. శత్రుదేశాలకు హెచ్చరికలు జారీ చేయడంలో ఉత్తర కొరియా ఎప్పుడూ ముందుంటుంది. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి తగ్గ సోదరి కిమ్ యో జోంగ్. ఆమె కూడా ఎప్పుడూ శత్రు దేశాలను కవ్వించడంలో ముందుంటుంది. తాజాగా ఆమె అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. తాము పరీక్షించే క్షిపణులను కూల్చివేస్తే సహించేది లేదని తేల్చి చెప్పింది. దానిని తమపై యుద్ధంగా భావిస్తామని పేర్కొంది.

అమెరికా – దక్షిణ కొరియా సంయుక్త యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా తప్పుబట్టింది. ఉత్తర కొరియా చేపట్టే వ్యూహాత్మక పరీక్షలకు వ్యతిరేకంగా అమెరికా సైన్యం చేపట్టే చర్యలను యుద్ధ ప్రకటనగా భావిస్తామని పేర్కొంది. తాము అవసరమైతే పసిఫిక్ మహా సముద్రం లోకి మరిన్ని క్షిపణులను ప్రయోగించగలమని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.

మరో వైపు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ మీడియా విభాగం కూడా అమెరికాపై ఆరోపణలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బి52 బాంబర్లతో అమెరికా నిర్వహించే యుద్ధ విన్యాసాలు పరిస్థితిని మరింత ఎగదోస్తున్నాయని పేర్కొంది. అమెరికా దక్షిణ కొరియా దేశాలు క్షేత్రస్థాయిలో కూడా యుద్ధ విన్యాసాలకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. పసిఫిక్ సముద్రం జపాన్ లేదా అమెరికా సొత్తు కాదని ఉత్తర కొరియా పేర్కొంది.

వాస్తవానికి ఇప్పటివరకు అమెరికా మిత్ర దేశాలు ఏనాడూ ఉత్తర కొరియా క్షిపణిని కూల్చివేయలేదు. కాకపోతే ఇటీవల కాలంలో జపాన్ సముద్రం పైకి తరచూ ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించడం ఆందోళనకరంగా మారింది. దీంతో ఈ వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు ఉత్తర కొరియా తన హెచ్చరికలను నిజం చేస్తూ పసిఫిక్ మహా సముద్రాన్ని ఫైరింగ్ రేంజిగా మార్చే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే అమెరికా బి52 బాంబర్లు దక్షిణ కొరియా విమానాలతో కలిసి పలుమార్లు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. దీంతోపాటు వచ్చేవారం నుంచి ఫ్రీడమ్ షీల్డ్ పేరిట 10 రోజులు యుద్ధ విన్యాసాలు నిర్వహించేందుకు ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Holi Celebrations | అమ్మాయిలూ.. రంగుల పండుగ నాడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

Exit mobile version