Sunday, April 14, 2024
- Advertisment -
HomeEntertainmentBalagam Movie | బలగం.. మట్టి వాసనంత అచ్చమైన పల్లెటూరి సినిమా..

Balagam Movie | బలగం.. మట్టి వాసనంత అచ్చమైన పల్లెటూరి సినిమా..

Balagam Movie | అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అంటూ త్రివిక్రమ్ అప్పుడెప్పుడో ఖలేజా సినిమాలో అద్భుతమైన మాటలు రాశాడు. కొన్ని సినిమాలకు ఈ మాటలు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి. తాజాగా విడుదలైన బలగం సినిమాకు కూడా గురూజీ మాటలు అతికినట్టు సరిపోతాయి. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. అసలు బలగం అనే సినిమా వస్తున్నట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు.

సరిగ్గా విడుదలకు 15 రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. పైగా దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా అని తెలియడంతో ప్రేక్షకుల్లో కూడా ఒకింత ఆసక్తి రేగింది. అన్నింటికీ మించి సిరిసిల్లలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐటి మినిస్టర్ కేటిఆర్ వెళ్లడంతో సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నారు. రిలీజ్ కు వారం రోజుల ముందు నుంచి ఈ సినిమాకు ప్రీమియర్స్ వేస్తూనే ఉన్నారు. ఇక మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఊహించినట్టుగానే మంచి రెస్పాన్స్ వస్తుంది.

అచ్చమైన తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ఈ సినిమా ఊరి అందాలతో పాటు.. చిలిపి తగాదాలు.. అన్నదమ్ముల ఆస్తి గొడవలు.. బావ బామ్మర్దుల కొట్లాటలు.. ఊళ్లో అప్పులు.. వాటిని ఎగ్గొట్టడానికి పడే తిప్పలు.. చివరగా ఒక మనిషి చావు.. ఆ చావులోనే బతుకును నేర్పిన విధానం.. అందరం కలిసి ఉంటేనే మన బలం బలగం అని వేణు చెప్పిన తీరు అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి.

చిన్న లైన్ తీసుకొని దాని చుట్టూ దర్శకుడు వేణు అల్లుకున్న కథనం ఆకట్టుకుంది. ప్రియదర్శి నటన.. కావ్య కళ్యాణ్ రామ్ స్క్రీన్ అప్పీయరెన్స్ సినిమాకు బాగా హెల్ప్ అయింది. తెలంగాణ పల్లెటూరులో ఎవరైనా చనిపోతే ఆ పద్ధతులు ఎలా ఉంటాయి అనేది ఈ సినిమాలో స్పష్టంగా చూపించాడు వేణు. బంధూ బలగం కలిసినప్పుడే మనం కూడా బాగుంటాం అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించాడు ఈయన. ముఖ్యంగా కథలో ఎంత వినోదం ఉందో.. అంత ఎమోషన్ కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ కడుపులు చెక్కలు ఎలా నవ్వించిన వేణు.. సెకండాఫ్ మాత్రం కన్నీరు పెట్టించాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేశాడు నిర్మాత దిల్ రాజు. కచ్చితంగా రాబోయే రోజుల్లో బలగం సినిమాకు థియేటర్లు పెరగడమే కాకుండా.. ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. ఇదే జరిగితే కమెడియన్ వేణు దర్శకుడిగా సక్సెస్ అయినట్టే.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Manchu Manoj | సైలెంట్‌గా మంచు మనోజ్‌, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్‌

Saif Ali Khan | మీడియాపై సైఫ్‌ అలీ ఖాన్ అసహనం‌.. ఇంకెందుకు లేటు.. మా బెడ్ రూమ్‌లోకి రండి అంటూ ఆగ్రహం!

Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News