Monday, April 15, 2024
- Advertisment -
HomeEntertainmentRamcharan | రామ్ చరణ్‌కి క్షమాపణలు చెప్పిన హాలీవుడ్‌ నటి.. ఎందుకంటే!

Ramcharan | రామ్ చరణ్‌కి క్షమాపణలు చెప్పిన హాలీవుడ్‌ నటి.. ఎందుకంటే!

Ramcharan | ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్టింగ్ చూశాక ఇండియాలోనే కాదు అమెరికాలోనూ చెర్రీకి ఫ్యాన్స్ అయ్యారు. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చరణ్ యాటిట్యూడ్‌కు చాలా ఇంప్రెస్ అయ్యారు. దీంతో అక్కడ కూడా మెగా వారసుడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్ ఛాయిస్ ( హెచ్‌సీఏ ) అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా అవకాశం దక్కింది. టాలీవుడ్ నుంచి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న ఏకైక హీరో చెర్రీనే. అయితే హెచ్‌సీఏ అవార్డు అందజేసే సమయంలో ఓ హాలీవుడ్ నటి చరణ్ పేరు మరిచిపోయింది. స్టేజి మీదకు పిలిచే క్రమంలో తడబడిపోయింది. దీంతో జరిగిన తప్పునకు క్షమాపణ కోరింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికా కాలిఫోర్నియాలో హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు హాలీవుడ్ నటి టిగ్ నొటారో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ కార్యక్రమంలో బెస్ట్ వాయిస్ / మోషన్ క్యాప్చర్ అవార్డు ఇవ్వడానికి రామ్‌చరణ్‌ను స్టేజి మీదకు పిలవాల్సి ఉంది. అలా స్టేజి మీదకు పిలిచే సమయంలో టిగ్.. రామ్ చరణ్ పేరు మరిచిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ రామ్…. అంటూ ఆగిపోయింది. తబడుతూ పేరు మరిచిపోయానంటూ బుంగమూతి పెట్టుకుంది. దీంతో చరణ్ అంటూ సిబ్బంది మాట సాయం అందించడంతో రామ్ చరణ్‌ను స్టేజి మీదకు పిలిచింది. నటి అంజలి భీమానితో కలిసి రామ్‌చరణ్ అవార్డు అందజేశాడు. ఈ సందర్భంగా నటి టిగ్ నొటారో చరణ్‌కు క్షమాపణ చెప్పింది. చరణ్ అనే పదం ఎలా పలకాలో తెలియకపోవడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యానని తప్పు ఒప్పుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది. ఏకంగా ఐదు అవార్డులను అందుకుని రికార్డు సృష్టించింది. బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్ కేటగిరీల్లో ఈ అవార్డులను అందుకుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగు చిత్ర సీమ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడని గర్వంగా ఫీలవుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Hyderabad | ఫ్రెండ్ గుండె, మర్మాంగం కోసి ప్రేయసికి వాట్సాప్‌లో పంపిన బీటెక్ విద్యార్థి.. అమ్మాయిపైనా కేసు.. ట్రైయాంగిల్ లవ్‌‌స్టోరీలో కొత్త ట్విస్ట్..

Hyderabad | నా లవర్‌నే ప్రేమిస్తావా.. ‌ స్నేహితుడి గుండె కోసి పాశవికంగా హత్య చేసిన యువకుడు – Time2news.com

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News