Wednesday, April 24, 2024
- Advertisment -
HomeNewsInternationalThomas Lee | అమెరికాలో ప్రముఖ బిలియనీర్ బలవన్మరణం..

Thomas Lee | అమెరికాలో ప్రముఖ బిలియనీర్ బలవన్మరణం..

Thomas Lee | అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ థామస్ లీ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆఫీస్‌లో తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం మన్‌ హట్టస్‌లోని తన కార్యాలయానికి వచ్చిన థామస్‌ లీ ఎంతసేపు అయినా గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. లోపలికి వెళ్లి పరిశీలించగా రక్తపు మడుగులో పడిపోయి కనిపించాడు. దీంతో కంగారు పడిపోయిన సిబ్బంది 911కు సమాచారం అందించారు. కాగా పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు ఆయన మరణించాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. థామస్ లీ తుపాకీతో కాల్చుకున్నట్లుగా నిర్ధారించారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సుమారు 16 వేల కోట్ల సంపద ఉన్న థామస్‌ లీ చనిపోవడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

థామస్‌ లీ వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్రరాజ్యంలో పేరున్న ఇన్వెస్టర్ థామస్‌ లీ. ఫైనాన్షియర్‌, ప్రైవేట్‌ ఈక్విటీ మార్కెట్‌, పెట్టుబడి వ్యాపారాల్లో ఆయన తన సత్తా చాటారు. దాదాపు 5 దశాబ్దాలుగా వందలాది సంస్థల్లో ఆయన 15 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. సంపాదించిన డబ్బును దానం చేయడంలోనూ థామస్ లీ ఎప్పుడూ ముందుంటారు. ది లింక్లన్‌ సెంటర్, మ్యూజియం అండ్‌ మోడ్రన్‌ ఆర్ట్‌, బ్రాండీస్‌ యూనివర్సిటీ, హార్వర్డ్‌ యూనివర్సిటీ, మ్యూజియం ఆఫ్ జెవిష్ హెరిటేజ్ వంటి సంస్థల్లో ఆయన ట్రస్టీ హోదాల్లో బోర్డు సభ్యుడిగా వ్యహరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Hyderabad | ఫ్రెండ్ గుండె, మర్మాంగం కోసి ప్రేయసికి వాట్సాప్‌లో పంపిన బీటెక్ విద్యార్థి.. అమ్మాయిపైనా కేసు.. ట్రైయాంగిల్ లవ్‌‌స్టోరీలో కొత్త ట్విస్ట్..

Hyderabad | నా లవర్‌నే ప్రేమిస్తావా.. ‌ స్నేహితుడి గుండె కోసి పాశవికంగా హత్య చేసిన యువకుడు – Time2news.com

Medical Student Preethi | వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెల్లడించిన వరంగల్ సీపీ.. తప్పు ఎవరిదంటే..

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News