Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsHyderabad | నా లవర్‌నే ప్రేమిస్తావా.. ‌ స్నేహితుడి గుండె కోసి పాశవికంగా హత్య చేసిన...

Hyderabad | నా లవర్‌నే ప్రేమిస్తావా.. ‌ స్నేహితుడి గుండె కోసి పాశవికంగా హత్య చేసిన యువకుడు

Hyderabad | ఇదో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్‌ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆ యువతి ఎవరిని ప్రేమించిందో తెలియదు కానీ వీళ్లిద్దరూ మాత్రం ఆమె కోసమే పట్టుబట్టారు. ఆ పిల్ల నాకే కావాలంటే నాకే కావాలని గొడవపడ్డారు. ఎలాగైనా ఆ అమ్మాయిని తానే దక్కించుకోవాలని అందులో ఒకడు అఘాయిత్యాకి ఒడిగట్టాడు. స్నేహితుడే కదా అన్న విచక్షణ కూడా మరిచిపోయి అతన్ని దారుణంగా చంపేశాడు. ఈ గుండె కదా నా లవర్‌ను ప్రేమించింది అని అతని గుండెను కత్తితో కోసి ప్రియురాలికి వాట్సాప్‌ కూడా చేశాడు. హైదరాబాద్‌ శివారులో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ (20 ).. నల్గొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న హరిహర.. నవీన్‌కు స్నేహితుడు. వీళ్లిద్దరూ అదే కాలేజీలో చదువుతున్న ఓ యువతిని ఇద్దరూ ప్రేమించారు. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న నవీన్‌ను అడ్డు తొలగిస్తే ప్రేమించిన యువతి తనకే సొంతం అవుతుందని హరిహర ఆశపడ్డాడు. దీంతో నవీన్‌ హత్య చేసేందుకు ఒక ప్లాన్‌ వేశాడు. ఆ పథకం ప్రకారం ఈ నెల 17న గెట్‌ టు గెదర్‌ పార్టీ చేసుకుందాం రమ్మని నవీన్‌ను హరిహర హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని తన రూమ్‌కి పిలిచాడు. హరిహర కుట్ర గురించి తెలియని నవీన్‌ .. స్నేహితుడే కదా అని అతను పిలిచిన చోటుకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్మాయి గురించి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో నవీన్ తన తండ్రి శంకరయ్యకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో శంకరయ్య కలగజేసుకుని హరిహరకు సర్దిచెప్పాడు. దీంతో గొడవ సద్దుమణిగిందని శంకరయ్య అనుకున్నాడు. కానీ నాలుగు రోజుల తర్వాత నవీన్‌ కాలేజీకి రావడం లేదని శంకరయ్యకు కాల్‌ వచ్చింది. ఆందోళన చెందిన శంకరయ్య ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఈ నెల 22న నార్కట్‌పల్లిలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరి మీద అనుమానంతో అతని స్నేహితులు, ఎంజీయూ విద్యార్థులను విచారించారు. దీంతో భయపడిపోయిన నవీన్‌ శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

గొడవ జరిగిన రోజు రాత్రే నవీన్‌ను హత్య చేసినట్లు హరి పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నవీన్‌ను చంపేసి అబ్దుల్లాపూర్‌ మెట్‌ సమీపంలోని గుట్టల్లో పడేసినట్లు వెల్లడించాడు. హరి చెప్పిన వివరాల ప్రకారం నవీన్‌ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది. అయితే ఈ కేసును పోలీసులు చాలా గోప్యంగా విచారిస్తున్నారు.

గుండెను వేరు చేసి.. వేళ్లను నరికేసి.. అత్యంత పాశవికంగా హత్య

పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్‌ను హరిహర అత్యంత దారుణంగా చంపినట్లు తెలిసింది. ఈ గుండెతోనే కదా నా లవర్‌ను ప్రేమించింది అంటూ నవీన్‌ గుండెను కత్తితో కోసి శరీరం నుంచి వేరు చేశాడు. ఈ వేలితోనే కదా నా ప్రియురాలిని తాకింది అంటూ వేళ్లను నరికేశాడు. అంతటితో ఆగకుండా వాటిని ఫొటోలు తీసి తన ప్రియురాలికి హరిహర వాట్సాప్‌లో పంపించాడు. దానికి ఓకే గుడ్‌ బాయ్‌ అంటూ సదరు యువతి రిప్లై ఇవ్వడం కూడా గమనార్హం. కాగా, నవీన్‌ హత్య కేసులో నిందితుడిని శిక్షించాలని అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News