Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsRGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని...

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

RGV | అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ.. వీధి కుక్కల నియంత్రణకు చర్యలను వేగవంతం చేశాయి. ఇదిలా ఉంటే ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ స్పందించిన తీరు హాట్‌ టాపిక్‌గా మారింది. కుక్కల దాడి వెనుక ఉన్న కోణం ఇదేనంటూ ఆమె చెప్పిన ఓ కారణంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ స్పందించాడు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మీకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై సమీక్ష నిర్వహించిన మేయర్‌ విజయలక్ష్మీ.. ఆకలితోనే కుక్కలు బాలుడిపై దాడి చేశాయని మేయర్ తెలిపారు.బాలుడి పై దాడి చేసిన శునకాలకు ఓ మహిళ రోజూ మాంసం పట్టేదన్న మేయర్.. రెండు రోజులపాటు ఆమె లేకపోవడంతో ఆకలి మీద ఉన్న కుక్కలు పసివాడిపై దాడి చేసి హతమార్చాయన్నారు. అందుకే ఒక్కో సర్కిల్‌లో 20 శునకాలను తీసుకొని క్లీన్ చేస్తే.. నెలకు 600 కుక్కల చొప్పున ఎవరైనా వాటిని పెంచుకోవడానికి ముందుకొస్తే బాగుంటుందని మేయర్ తెలిపారు. శునకాలకు ఆహారం అందించే వారికి అవగాహన కల్పిస్తామన్నారు.

మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ స్పందనపై ఆర్జీవీ సెటైర్‌ వేశారు. ‘కేటీఆర్ సార్.. హైదరాబాద్ నగరంలోని 5 లక్షల శునకాలను పట్టుకొని డాగ్ హోంలో వేయండి. వాటి మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఉండేలా చూడండి’ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. చాలా మంది నెటిజన్లు ఆర్జీవీ కామెంట్ పట్ల సానుకూలంగా స్పందిస్తుండటం గమనార్హం. అంతటితో ఆగకుండా ఒక వీడియో మెసేజ్‌ కూడా పోస్టు చేశాడు. నాకు ఏ డిపార్ట్‌మెంట్‌ అనేది సరిగ్గా తెలియదు. కాకపోతే వీధి కుక్కల నియంత్రణకు చూసేవాళ్లు ఒక పనిచేయాలి. అంబర్‌పేటలో బాలుడి మృతికి కారణమైన కుక్కలతో పాటు.. నగరంలోని ఓ 5 వేల కుక్కలను తీసుకొచ్చి మేయర్‌ ఇంట్లో వదిలేయాలి. అన్నివైపుల నుంచి డోర్లు, కిటికీలు పెట్టి మేయర్‌ను అందులో వదిలేయాలి. అప్పుడు వాటిపై మేయర్‌కు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలుస్తుంది. ‘ అంటూ వీడియో పోస్టు చేశాడు. దీన్ని మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. గతంలో కూడా మేయర్‌ విజయలక్ష్మీని ఆర్జీవీ టార్గెట్‌ చేశాడు.

విజయలక్ష్మీ తన పెంపుడు శునకానికి చపాతీ తినిపిస్తోన్న వీడియోను 2021 మార్చి 3న ట్వీట్ చేసిన వర్మ.. ‘గౌరవనీయులైన మన మేయర్ తాను ఎడమ చేత్తో తింటూ.. తన శునకానికి కుడి చేత్తో తినిపిస్తోంది. గౌరవనీయులైన మేయర్ గారి నిస్వార్థమైన ప్రేమ ఇది. గద్వాల విజయలక్ష్మీని ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్స్‌గా చేయాలి’ అని జీహెచ్ఎంసీ మేయర్‌పై అప్పట్లో ఆర్జీవీ సెటైర్ వేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News