Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsViral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Viral News | రైతులను వ్యాపారులు, దళారులు ఎంతలా దోచుకు తింటున్నారో ఈ ఘటనే నిదర్శనం. 512 కిలోల ఉల్లిగడ్డ అమ్మిన రైతుకు.. ఓ వ్యాపారి కేవలం రూ.2 మాత్రమే ఇచ్చాడు. అది కూడా నగదు కాదు.. చెక్ చేతిలో పెట్టాడు. గిట్టుబాటు ధర కాదు కదా.. బిచ్చమేసినట్లుగా డబ్బులు రావడంతో ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్ కమిటీలో రాజేంద్ర తుకారం చవాన్ అనే రైతు 10 బస్తాల ఉల్లిపాయలను విక్రయించాడు. 512 కిలోల ఉల్లిగడ్డలు విక్రయిస్తే కిలోకు ఒక్క రూపాయి చొప్పున రూ.512 వస్తాయని అనుకున్నాడు. కానీ ఉల్లిగడ్డ కొన్న వ్యాపారి రైతును భారీగా మోసం చేశాడు. ట్రాన్స్‌పోర్టు ఛార్జీలు, హమాలీ ఛార్జీలు అన్ని ఆ రైతు మీదే వేశాడు. ఆ ఖర్చులన్నీ కలిపితే రూ.509 అయ్యాయని వాటిని తీసిస్తే.. రూ.2.49 వస్తాయని బిల్లును రైతుకు ఇచ్చాడు. ఆ చిల్లర కూడా నగదు ఇవ్వలేదు. దాన్ని కూడా చెక్కు రూపంలో ఇచ్చాడు. రెండు రూపాయల చెక్కు ఇచ్చి.. మీది 49 పైసలను 15 రోజుల తర్వాత ఇస్తానని ట్విస్ట్‌ ఇచ్చాడు.

ఇది చూసి ఆ రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆరుగాలం కష్టపడిన శ్రమ ఫలితం రెండు రూపాయలేనా అంటూ బాధపడిపోయాడు. ఇది చూసిన స్థానిక రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయంపై స్వాభిమాని షెట్కారీ సంఘం అధ్యక్షుడు రాజుశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. రైతుకు వ్యాపారి ఇచ్చిన బిల్లును ఫొటో తీసి షేర్ చేస్తూ.. “పాలకులారా.. కాస్త సిగ్గుపడండి.. మీరు రైతులకు ఎలా బతకాలో చెప్పండి. ఒకవైపు రైతుల కరెంటు కనెక్షన్ కట్ చేయడం మూలాన కళ్ల ముందే పంట కోతకు గురవుతోంది.

సోలాపూర్ మార్కెట్ కమిటీలో ఉల్లిపాయల బస్తాలు.. విక్రయిస్తే రైతుకు వ్యాపారి రెండు రూపాయల చెక్కు ఇచ్చాడు. అలా ఇవ్వడానికి మీకు సిగ్గు ఎలా అనిపించలేదు. 15 రోజుల్లో ఈ చెక్కు క్లియర్ అవుతుందని ఆ వ్యాపారి రైతుకు చెబుతున్నాడు’ అంటూ రాజుశెట్టి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు సదరు వ్యాపారిని ఏకి పారేస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News