Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLatest NewsHeart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన...

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

Heart Stroke | యువకుల గుండెలు ఆగిపోతున్నారు. ఒకప్పుడు అరవై ఏళ్లు పైబడిన తర్వాత వచ్చే గుండెపోటులు ఇప్పుడు ఇరవై ఏళ్లలోనే వస్తున్నారు. కార్డియాక్‌ అరెస్టు కారణంగా హైదరాబాద్‌ నగరంలో ఒక్కరోజులోనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సరైన సమయంలో సీపీఆర్‌ అందడంతో మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన విశాల్‌.. ఆసిఫ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం జిమ్‌కు వెళ్లిన విశాల్ కాసేపు వ్యాయామం చేశాడు. ఇంతలోనే అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో జిమ్‌లో ఉన్న సహచరులు వచ్చి ఏమైందని చూడగా.. ఆలోపే విశాల్‌ కన్నుమూశాడు. గురువారం సాయంత్రం జరిగిన ఓ వివాహ వేడుకలో ఓ వ్యక్తి ఇలాగే మరణించాడు. అప్పటిదాకా బంధువులతో సరదాగా గడిపిన రబ్బానీ అనే వ్యక్తి ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ గుండెపోటు కారణంగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు చెప్పారు.

కానిస్టేబుల్‌ సీపీఆర్‌ ఇవ్వడంతో బయటపడ్డ మరో వ్యక్తి

ఆరాంఘర్‌ చౌరస్తాలో కూడా ఇలాగే బాల్‌రాజ్‌ అనే వ్యక్తి రెండు సార్లు సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజ్‌కుమార్ ఇది గమనించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి సీపీఆర్‌ అందించాడు. చాలా సేపటి తర్వాత అతనికి చలనం వచ్చింది. దీంతో చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. కాగా.. సమయస్ఫూర్తితో ఓ యువకుడి ప్రాణాలు కాపాడినందుకు కానిస్టేబుల్‌ను అంతా మెచ్చుకుంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitte

Heart Stroke | యువకుల గుండె ఆగిపోతుంది.. జిమ్‌ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్‌.. రోడ్డుపైనే సొమ్మసిల్లిన మరో వ్యక్తి

RGV | జీహెచ్‌ఎంసీ మేయర్‌పై ఆర్జీవీ సెటైర్‌.. 5వేల వీధికుక్కలను గద్వాల విజయలక్ష్మీ ఇంట్లో వదిలేయాలని కేటీఆర్‌కు రిక్వెస్ట్‌

Viral News | 500 కిలోల ఉల్లిగడ్డలు కేవలం 2 రూపాయలే!

Australia | మ్యాక్స్‌వెల్, మిషెల్ మార్ష్ రీఎంట్రీ.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News