Home Entertainment RRR | హాలీవుడ్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ హవా.. ఒకేసారి 4 అవార్డులతో రికార్డు

RRR | హాలీవుడ్‌ అవార్డ్‌ ఫంక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ హవా.. ఒకేసారి 4 అవార్డులతో రికార్డు

RRR | హాలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. అక్కడి క్రిటిక్స్‌ను మెప్పించి వరుస అవార్డులను అందుకుంటుంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ వంటి అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ ఇప్పుడు మరో పురస్కారం దక్కించుకుంది. హాలీవుడ్‌ క్రిటిక్స్‌ ఇచ్చే హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ ( HCA ) అవార్డును గెలుచుకుంది. ఏదో ఒక్క కేటగిరీలో కాదు.. ఏకంగా నాలుగు కేటగిరీల్లో ఈ అవార్డులను గెలుచుకుంది.

ముందుగా ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ యాక్షన్‌ చిత్రం కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డు గెలుచుకుంది. బెస్ట్‌ స్టంట్‌ అవార్డును కూడా అందుకుంది. అలాగే ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కార్‌కు నామినేట్‌ అయిన నాటు నాటు సాంగ్‌ మళ్లీ రికార్డు సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్‌ స్కోర్‌ కేటగిరీలో హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డు అందుకుంది. అలా మొత్తంగా నాలుగు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలిచింది. బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఫిలిం కేటగిరీల్లో కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నామినేట్‌ అయ్యింది. కానీ అందులో నిరాశే ఎదురైంది. ఈ అవార్డులు ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌ సినిమాకు వచ్చాయి. అన్నట్టు ఈ సినిమా బెస్ట్‌ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నిలిచే అవకాశం కూడా ఈ సినిమాకే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్‌ఆర్‌ఆర్‌కు బెస్ట్‌ స్టంట్స్‌ అవార్డును అందించిన హెచ్‌సీఏ సభ్యులకు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో కష్టపడి స్టంట్స్‌ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్‌, క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కంపోజ్‌ చేసిన జూజీతోపాటు.. ఇతర స్టంట్స్‌ మాస్టర్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇది కేవలం తనకు, తన చిత్రానికే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవం.. మేరా భారత్‌ మహాన్‌, జైహింద్‌ అని అవార్డును అందుకునే సమయంలో రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇక ఈ హాలీవుడ్‌ క్రిటిక్ అసోసియేషన్‌ (హెచ్‌సీఈఏ) అవార్డుల ప్రదానోత్సవానికి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలా హాలీవుడ్‌ అవార్డుల ఫంక్షన్‌కు ప్రజెంటర్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి టాలీవుడ్‌ నటుడు చెర్రీనే కావడం విశేషం. చరణ్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ ఫిలిం అవార్డ్స్‌ ఫంక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు నాలుగు అవార్డులు రావడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని తెలుపుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version