Kajal Agarwal | పెళ్లి తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది కాజల్. మరోవైపు స్టార్ హీరోలు కూడా ఆమెతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే సీనియర్ హీరోల వైపు చూస్తుంది కాజల్ అగర్వాల్. తెలుగులో ఇప్పటికే కుర్ర హీరోలు అందరినీ కవర్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు 60 ప్లస్ హీరోలతో జోడి కట్టడానికి రెడీ అయిపోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన కాజల్.. తాజాగా ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ తో జోడి కట్టింది. ఇక అనిల్ రావిపూడి, బాలకృష్ణ సినిమాలో కూడా హీరోయిన్గా ఎంపిక అయింది.
ప్రస్తుతమున్న పరిస్థితుల్లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు అస్సలు దొరకడం లేదు. అందుకే కాజల్, తమన్నా, శృతి హాసన్, త్రిష లాంటి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతున్నారు.
ఇదే ఛాన్స్ అని వాళ్లు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఒకప్పుడు సినిమాకు కోటి వరకు తీసుకున్న కాజల్ ఇప్పుడు ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్ లో రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. భారతీయుడు సీక్వెల్ కోసం బాగానే తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. బాలకృష్ణ సినిమా కోసం కూడా దాదాపు రెండు కోట్లకు పైగానే చార్జ్ చేస్తుందని ప్రచారం జరుగుతుంది.
మార్చి 4 నుంచి అనిల్ రావిపూడి సినిమా సెట్ లో జాయిన్ కానుంది కాజల్. సీనియర్ హీరోలకు మరో ఆప్షన్ లేదని తెలిసిన తర్వాత వీళ్ళు కొండెక్కి కూర్చుంటున్నారు. నిర్మాతలకు కూడా ఇక్కడ ఇంకో ఆప్షన్ కనిపించడం లేదు. ఎంతసేపు ఈ సీనియర్ హీరోయిన్ల చుట్టూ తిరగాలి కాబట్టి వాళ్లలో కాస్త బెటర్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ల వైపు అడుగులు వేస్తున్నారు దర్శకులు.
ఈ నేపథ్యంలోనే కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో మొత్తం సీనియర్ హీరోల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. అవి విజయం కూడా సాధిస్తే అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా వెలిగిపోవడం ఖాయం. మరోవైపు అజిత్ నెక్స్ట్ సినిమాలో కూడా కాజల్ ను ఒక కీలక పాత్ర కోసం అడుగుతున్నారు. గతంలో ఇద్దరు కలిసి నటించిన వివేకం డిజాస్టర్ అయ్యింది. ఈసారి హీరోయిన్ గా కాకుండా కీలక పాత్ర కోసం తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఏదేమైనా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు కాజల్. మొదటి నుంచి కూడా పారితోషికం విషయంలో కాజల్ కండిషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. అడిగినంత ఇస్తే తప్ప డేట్స్ ఇవ్వని హీరోయిన్లలో కాజల్ అందరికంటే ముందుంటుంది. ఇప్పుడు కూడా అదే సూత్రం అప్లై చేస్తుంది. మరి ఈ కండిషన్లతో కాజల్ కెరీర్ ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో చూడాలి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?
Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ
Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!
Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..
Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్ పోస్తా అంటూ జబర్దస్త్ యాంకర్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్