Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentMrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Mrunal Thakur | కొందరు హీరోయిన్ల జాతకం అలాగే ఉంటుంది. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తో పరిచయమైనా కూడా.. ఆ తర్వాత ఆ రేంజ్ సినిమా కోసం మళ్లీ కెరీర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ను చూస్తే ఇదే అనిపిస్తుంది. గతేడాది సీతా రామం సినిమాతో మృణాల్ పేరు మార్మోగిపోయింది. సీతగా ఆమె నటన చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఎంత అద్భుతంగా నటించింది. ఆ పాత్ర కోసమే పుట్టిందా అన్నట్టు ఆమెను ప్రశంశాలతో ముంచెత్తారు. అయితే సీతా రామం తర్వాత ఈమె చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.
దానికి తోడు ఆ సినిమాలో చాలా పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత మాత్రం ఏకంగా బికినీలు వేసుకొని వేడి పుట్టిస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఈమెకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తుంది.

ఆ మధ్య జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ తో నటించిన కూడా పెద్దగా ఉపయోగ పడలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఈ మధ్య అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సెల్ఫీ సినిమాలో కనిపించింది మృనాల్. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఇది.. కనీసం ఒక్కరోజు కూడా ఆడలేదు. 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమాకు 8 కోట్లు కూడా రాలేదు. అక్షయ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది సెల్ఫీ.

ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది మృనాల్.
అక్షయ్ లాంటి పెద్ద హీరోతో నటించడంతో తన కెరీర్ సెట్ అయిపోయిందని.. ఇకపై వరుసగా అవకాశాలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న మన సీతకు ఊహించని షాక్ ఇచ్చింది సెల్ఫీ. ప్రస్తుతం ఈయనకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో నాని హీరోగా వస్తున్న సినిమాలో మాత్రమే హీరోయిన్ గా నటిస్తోంది మృణాల్.

దీంతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. టాలీవుడ్ కంటే బాలీవుడ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు.. అక్కడ మాత్రం టైం అసలు కలిసి రావడం లేదు. ఇదంతా చూసి అయ్యో రామా మన సీతకు ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News