Tuesday, April 23, 2024
- Advertisment -
HomeEntertainmentNayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Nayanthara | లేడీ సూపర్‌స్టార్‌ నయనతారకు సౌత్‌ ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంది. మలయాళ సినీ ఇండస్ట్రీలో కెరీర్‌ మొదలుపెట్టిన నయన్‌.. ఇప్పుడు తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌కు కూడా అడుగుపెడుతుంది. ఇలా కెరీర్‌లో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న నయన్‌ గురించి ఇప్పుడు ఒక న్యూస్‌ వైరల్‌గా మారింది. ఉన్నపళంగా ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని చూస్తుందని ప్రచారం జరుగుతోంది.

చాలా ఏళ్లుగా కోలీవుడ్‌ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమలో ఉన్న నయనతార.. గత ఏడాది పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టింది. సరోగసీ ద్వారా అదే ఏడాది పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయినప్పటికీ నయన్‌ వరుస సినిమాలతో గడిపేస్తోంది. దీంతో పిల్లల ఆలనాపాలన చూసుకోవడం చాలా కష్టమైపోతుందట. అందుకే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి పిల్లల కోసం టైమ్‌ కేటాయించాలని ఫిక్సయిందని సమాచారం. ప్రస్తుతం నయన్‌ చేతిలో జవాన్‌ అనే బాలీవుడ్‌ సినిమా ఉంది. షారుక్‌ఖాన్‌ హీరోగా వస్తున్న ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కిస్తున్నాడు. సెట్స్‌ మీద ఉన్న జవాన్‌ షూటింగ్‌ కంప్లీట్‌ కాగానే.. సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నయన్‌ నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతుంది. అందుకే వేరే సినిమాలు ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News