Friday, April 26, 2024
- Advertisment -
HomeEntertainmentAkshay Kumar | మీరు సినిమాలు ఆపేయండి.. నష్టాలతో చస్తున్నాం.. ఆ హీరోపై డిస్ట్రిబ్యూటర్ల కోపం..!

Akshay Kumar | మీరు సినిమాలు ఆపేయండి.. నష్టాలతో చస్తున్నాం.. ఆ హీరోపై డిస్ట్రిబ్యూటర్ల కోపం..!

Akshay Kumar | బాడ్ లక్ బ్యాక్ పాకెట్ లో పెట్టుకొని తిరిగితే ఏ సినిమా చేసినా కూడా ఫలితం మాత్రం దారుణంగానే ఉంటుంది. ఇప్పుడు అక్షయ్ కుమార్ ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కొన్నేళ్ల కింద తన దూకుడుతో ఏకంగా ఖాన్స్ త్రయానికి చెమటలు పట్టించిన కిలాడికి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. అది కూడా ఇంత అంతా కాదు. ఏ సినిమా చేసినా రెండు మూడు రోజులు కూడా ఆడడం లేదు.

దానికి తోడు వరుస ప్లాపులు ఈయనను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ పరాజయాలతో డిస్ట్రిబ్యూటర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు అక్షయ్ కుమార్. మూడేళ్లలో 9 సినిమాలు చేసిన ఈయన ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. ఈ మధ్య విడుదలైన సెల్ఫీ సినిమాకు కనీసం 10 కోట్లు కూడా రాలేదు.

మొదటి రోజే ఈ సినిమా థియేటర్లలో ఈగలు, దోమలు తోలుకుంటూ కనిపించారు ఎగ్జిబిటర్లు. దీన్నిబట్టి అక్షయ్ కుమార్ మార్కెట్ ఎంత దారుణంగా పడిపోయిందనే విషయం అర్థమైపోతుంది. 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకు కనీసం 8 కోట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదిప్పుడు. ఒక్కో సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ కథ విషయంలో ఎందుకు జాగ్రత్త తీసుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు.

రీమేక్ సినిమాలు చేయొద్దు అని ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా వినకుండా అవే చేసుకుంటూ పోతే.. అతడిని నమ్మి సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు అడ్డంగా మునిగిపోతున్నారు. 2019 నుంచి అక్షయ్ కుమార్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. మధ్యలో సూర్యవంశీ సినిమా మాత్రమే కాస్త ఓకే అనిపించింది. ఇక మిగిలినవన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అవుతూ వస్తున్నాయి.

మధ్యలో ఓటిటి వేదికగా విడుదలైన లక్ష్మి, కట్ పుత్లి కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక గతేడాది విడుదలైన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్ లాంటి సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్లిపోయాయో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు.
ఇలా వచ్చిన ప్రతి సినిమా కనీసం 50 నుంచి 100 కోట్ల వరకు నష్టాలు తీసుకొస్తుంటే డిస్టిబూటర్లు ఆయనపై మండి పడుతున్నారు.

ఇక మీరు సినిమాలు చేయొద్దు అంటూ అల్టిమేటమ్ జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అక్షయ చేతిలో అరడజన్ సినిమాలు ఉన్నాయి. అందులో సగానికి పైగా రీమేకులే. అలాంటి సినిమాలు చేసి మాకు మేకులు దించకు బాబు అంటూ బయ్యర్లు గోల పెడుతున్నా కూడా.. అక్షయ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికిప్పుడు ఈయనకు ఒక హిట్ రాలేదంటే మాత్రం పరిస్థితి ఇంతకంటే దారుణంగా మారిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News